Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                 
    Show Latest News
ప్రత్యేక హోదాపై విస్తృత చర్చ

Published on : 17-Feb-2018 | 11:42
 

–  వైయస్‌ జగన్‌  అవిశ్రాంత పోరాటం
– ఇవాళ విజయనగరంలో చర్చా వేదిక
విజయనగరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తోంది. నాలుగేళ్లుగా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని, ఏప్రిల్‌ 6వ తేదీ వరకు హోదాపై అనుకూల ప్రకటన చేయకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని పార్టీ అధినేత  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. నిన్న శ్రీకాకుళం జిల్లాలో హోదా కోసం ఎందాకైనా పేరిట చర్చా వేదికను సీనియర్‌ పాత్రికేయులు కేఎస్‌ఆర్‌ నేతృత్వంలో నిర్వహించగా, ఇవాళ విజయనగరంలోని నాయుడు పంక్షన్‌ హాల్‌లో చర్చా వేదికను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హోదా కోసం చేసిన పోరాటాలు ఇలా ఉన్నాయి..


 వైయ‌స్ జ‌గ‌న్‌ అలుపెర‌గ‌ని పోరాటం
19–05–14 – ఢిల్లీ లోని గుజరాత్‌ భవన్‌లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి  కొత్తగా ఆవిర్భంవించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురోభివృధ్ధికి సహకారం అందించాలని, ప్రత్యేక హోదా సహా విభజన బిల్లులోని హామీలన్నీ నెరవేర్చాలని కోరిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి   
12–06–14 – ఆంధ్రప్రదేశ్‌కు 20 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని లోక్‌సభలో కోరిన  ఎంపీ మేకపాటి  రాజమోహన్‌ రెడ్డి.
05–12–14 –  ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు, విశాఖ కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి.
15–02–15 – ఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను, ఆర్ధిక మంత్రి అరుణ్‌   జైట్లిని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని
కోరిన వైయ‌స్‌ జగన్‌
16–03–15 – లోక్‌సభలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.
30–03–15 – స్పెషల్‌ స్టేటస్,  ఇతర హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని  వైయ‌స్ఆర్‌సీపీ బృందం.
31–03–15 – విభజన హామీలను సత్వరం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసిన వైయస్‌ జగన్‌.
12–05–15 – ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటులోనూ, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు.
03–06–15 – ఏడాది పాలనలో చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా సాధించలేకపోవడాన్ని ఎండగడుతూ మంగళగిరి వద్ద  వైయస్‌  జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల సమర దీక్ష. ప్రజా బ్యాలెట్‌ నిర్వహణ.
 (03–06–15 మరియు 04–06–15 రెండు రోజులు)
09–06–15 – ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చూడాలని భారత  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించిన వైయస్‌
జగన్‌
11–06–15 – ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అమలు కోరుతూ ఢిలీలో కేంద్ర మంత్రులు
రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్‌ జైట్లీలను కలిసిన  వైయస్‌ జగన్‌
10–08–15 – ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒకరోజు ధర్నా నిర్వహించిన  వైయస్‌ జగన్‌
29–08–15 – ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌ నిర్వహించిన వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌.
15–09–15 – తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం నిర్వహించిన విద్యార్ధుల యువభేరి సదస్సులో పాల్గొన్న‌ వైయస్‌ జగన్‌
22–09–15 – విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు ప్రత్యేకహోదా కోసం నిర్వహించిన యువభేరి సదస్సుకు హాజరైన  వైయస్‌
జగన్ 
07–10–15 – ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన  వైయస్‌ జగన్. 7 రోజుల తర్వాత బలవంతంగా నిరాహార దీక్షను
భగ్నం చేసిన పోలీసులు (07–10–15 నుంచి 13–10–15 తెల్లవారుజాము వరకు 7 రోజులు)
17–10–15 – ప్రత్యేక హోదా సాధనలో భాగంగా 17–10–15 నుంచి 21–10–15 వరకు  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు
27–01–16 – ప్రత్యేక హోదా కోరుతూ కాకినాడలో యువభేరి సదస్సులోనూ, తర్వాత బహిరంగ సమావేశంలోనూ పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌
02–02–16 – ప్రత్యేక హోదా కోరుతూ శ్రీకాకుళంలో నిర్వహించిన యువభేరి సదస్సులో పాల్గొన్న వైయ‌స్ జగన్ .
23–02–16 – రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదాతో సహా  ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలయ్యేలా చూడాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ విన‌తి.
27–04–16 – సేవ్‌ డెమొక్రసీ పోరులో భాగంగా ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసిన వైయ‌స్‌ జగన్ఏ. పీకి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని వినతి.
10–05–16 – ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌. 
21–07–16 – రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేకహోదా బిల్లుకు మద్దతు ప్రకటించిన  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ. 
23–07–16 – 15 ఏళ్లు ప్రత్యేక హోదా కోరుతూ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రతిపాదించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.
29–07–16 – ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ వైఖరులకు నిరసనగా అగస్ట్‌ 2న రాష్ట్ర బంద్‌కు పిలుపు  
02–08–16 ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌ సంపూర్ణం.
04–08–16 – ప్రత్యేక హోదా కోరుతూ నెల్లూరులో జరిగిన యువభేరి సదస్సులో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌
08–08–16 – ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించిన వైయ‌స్ జ‌గ‌న్‌, ఎంపీలు
 8–09–16 – 8 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం.. ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్ నేతృత్వంలో అసెంబ్లీని
నిర్భందించిన ఎమ్మెల్యేలు. 
 10–09–16 – ప్రత్యేక హోదా కోసం  రాష్ట్ర బంద్‌.  
22–09–16 – ప్రత్యేక హోదా కోసం ఏలూరులో విద్యార్థులతో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌
25–09–16 – ప్రత్యేక హోదా కోసం ఎన్‌ ఆర్‌ఐలతో  వైయ‌స్‌ జగన్‌  టీవీ చర్చా కార్యక్రమంలో ముఖాముఖి.
25–10–16 – ప్రత్యేక హోదా కోసం కర్నూలులో విద్యార్థులు, యువజనులతో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌ 
6–11–16 – ప్రత్యేక హోదా కోసం విశాఖటపట్నంలో నిర్వహించిన మొట్ట మొదటి జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభలో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌.
19–12–16 – ప్రత్యేక హోదా కోసం విజయనగరంలో విద్యార్థులు, యువజనులతో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌
26–01–17 – ప్రత్యేక హోదా సాధన కోసం రిపబ్లిక్‌ డే నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, యువత, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చిన
వైయ‌స్  జగన్‌. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్న శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పిన ప్రభుత్వం. విశాఖ ఆర్‌కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్ళిన వైయ‌స్ జ‌గ‌న్‌ను విశాఖ
ఎయిర్‌పోర్టులోనే 3 గంటలపాటు నిర్భందించిన పోలీసులు.  
27–01–17 – వైయ‌స్‌ జగన్‌ని అప్రజాస్వామికంగా ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన టీడీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అన్నిమండల కేంద్రాల్లో నిరనసలు. 
07–02–17 – రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడానికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రతిపాదన– బలం లేకపోవడంతో వీగిపోయిన ప్రతిపాదన.
 ప్రత్యేక హోదా ప్రతిపాదన సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసిన టీడీపీ ఎంపీలు.
16–02–17 – ప్రత్యేక హోదా కోసం గుంటూరులో విద్యార్థులు, యువజనులతో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్ 
10–03–17 – ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ళ పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
లోక్‌సభలో ప్రైవేటు బిల్లు
28.03.17-  లోక్‌సభలో ఎన్‌ఐటీ, ఎన్‌ఈఆర్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీలు
30–03–17 –  లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో  ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్.
06–04–17 – ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ వి. విజయసాయిరెడ్డి  డిమాండ్ .
10–5–17 – ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని కలసి వినతిపత్రం సమర్పించిన వైయ‌స్ జ‌గ‌న్‌
16–07–17 – రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో కోరిన‌ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వి. విజయసాయిరెడ్డిలు  
10–10–17 – ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విద్యార్థులు, యువజనులతో అనంతపురంలో ఏర్పాటు చేసిన యువ భేరీ సదస్సులో పాల్గొన్న  వైయస్‌ జగన్‌.
20–11–17 –ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విపక్షాలు ఇచ్చిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు
10–12–17 –రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ‌న‌కు పార్ల‌మెంట్‌లో గ‌ళం వినిపించాల‌ని పార్టీ ఎంపీల‌కు అనంతపురం జిల్లా కూడేరులో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం.   
01-02-2018 నుంచి నిర్వ‌హించిన పార్ల‌మెంట్ బ‌డ్జెట్‌ స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల నిరస‌న కార్య‌క్ర‌మాలు.
 13.02.2018- మార్చి1 నుంచి క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డి. 5న ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు. మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ప‌ట్టు. అప్ప‌టికీ ఇవ్వ‌క‌పోతే ఏప్రిల్ 6న ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌ని వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com