Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                 
    Show Latest News
అండ‌గా ఉంటా
వైయ‌స్ జగన్‌ మోహన్‌​ రెడ్డి

Published on : 21-Feb-2018 | 17:46
 



- కిడ్నీ బాధితుల‌కు నెల‌కు రూ.10 వేల పింఛ‌న్‌
-  సీపీఎస్ విధానం ర‌ద్దు చేస్తాం
- రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాం
- ముగిసిన 94వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 
ఒంగోలు:  వైయ‌స్ జగన్‌ మోహన్‌​ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ 94వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్క‌డి నుంచి చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం, పర్చూరివారిపాలెం , వెంగళాపురం క్రాస్‌ మీదుగా పాదయాత్ర పెద్దఅలవలపాడుకు సాగింది. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ 13.5 కిలోమీట‌ర్లు న‌డిచారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను రైతులు, ఉపాధ్యాయులు, కిడ్నీ బాధితులు, మ‌హిళ‌లు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల‌కు రూ.10 వేల పింఛ‌న్ ఇస్తామ‌ని మాట ఇచ్చారు. అలాగే సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేసి ఉద్యోగుల‌కు మేలు చేస్తామ‌న్నారు. రైతులు పండించిన  పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు రూ.3 వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో జిల్లా ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  పాదయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ ఇప్పటి వరకు 1275.9 కిలోమీట‌ర్లు నడిచారు. దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com