Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                 
    Show Latest News
నంద్యాల్లో డబ్బు పరవళ్లు

Published on : 17-Jul-2017 | 15:39
 

– ఉప ఎన్నిక కోసం సగం మంత్రి వర్గం మోహరింపు
– ఇంటికో టీడీపీ నాయకుడి వంతున నిఘా 
– మూడేళ్లలో అభివృద్ధి మరిచి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనే వ్యూహం
– టీడీపీ అరాచకాలకు నంద్యాల ప్రజల బెంబేలు 

మాటెత్తితే ఇది ఒక చరిత్ర.. అని మొదలు పెట్టే చంద్రబాబునాయుడు.. నంద్యాల ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే రికార్డు ఖర్చుకు వెనకాడటం లేదు. కేవలం ఒక నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించడానికి పడుతున్న కష్టాలు చూస్తుంటే చంద్రబాబుకి తన పాలన మీద తానే నమ్మకం కోల్పోయినట్టుగా ఉంది. నేను చేపట్టే అభివృద్ధి, నా విజన్‌ చూసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది టీడీపీలో చేరారని ఊదరగొడుతూ చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబుకు.. ఆయన చేతలకు సంబంధం లేకుండా పోతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడకముందే అక్కడ జరుగుతున్న హడావుడి చూస్తుంటే బాబులో నంద్యాల ఓటమి భయం సుస్పష్టం.

నంద్యాల కోసమే నియామకాలు...
పార్టీ మారిన రాయలసీమకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి. మొమెన్‌కి ఉర్దూ అకాడమీ చైర్మన్‌ పదవి.. కాపు కార్పొరేషన్‌ కింద పెళ్లి మండపాలకు రూ. 3 కోట్లు.. మూడేళ్లుగా లేనిది ఉన్నట్టుండి 150 కోట్లతో అభివృద్ధి పనులు.. సగం క్యాబినెట్‌ మొత్తం నంద్యాల ప్రచారంలో తలమునకలు.. రాయలసీమ నాలుగు జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా నంద్యాలలో మోహరింపు.. ఇప్పటికే ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్‌ రెండు రోజుల పర్యటన.. నారా చంద్రబాబు నాయుడు నంద్యాల నియోజకవర్గం పరిధిలోని గోస్పాడు మండల నాయకులతో సమీక్ష.. పార్టీ ముఖ్యనాయకులతో ఫోన్‌లో ముఖ్యమంత్రి సంప్రదింపులు... ఇవన్నీ  నంద్యాల ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ చేస్తున్న ఫీట్లు. 

అభివృద్ధి చేసుంటే భయమెందుకో..?
మూడేళ్లుగా అధికారం వెలగబెడుతున్నారు.  రెండంకెల గ్రోత్‌ రేటుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, కేంద్రం కన్నా ఎక్కువ జీఎస్‌డీపీతో దూసుకెళ్తున్నామని పదే పదే చెప్పుకుంటారు. గతేడాది 6 లక్షల కోట్లు, ఈ ఏడాది పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చా.. 18 సార్లు విదేశీ పర్యటనలు చేసి పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు నెలకొల్పామని చెప్పుకు తిరుగుతారు.. నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రతి జూన్‌ 2 నుంచి వారం రోజులు రోడ్ల నిండా సభలు నిర్వహించి పేపర్ల నిండా కోట్లకు కోట్లు విలువైన యాడ్‌లు దంచికొడతారు. కోట్లాది మంది ఉద్యోగాలు ఇచ్చామన్నారు.. రెయిన్‌గన్‌లతో రాయలసీమ నుంచి కరువు పారదోలామని.. దోమలపై దండయాత్ర మొదలు పెట్టాడు.. ఆంధ్రప్రదేశ్‌ను మూడేళ్లలోనే ఇంతగా అభివృద్ధి పథంలో కొంత పుంతలు తొక్కించిన చంద్రబాబుకు నంద్యాల ఎన్నికలంటే అంతగా భయపడాల్సిన పనే లేదు. కానీ జరుగుతున్నది మాత్రం వాస్తవ విరుద్ధం. 

నోటిఫికేషన్‌ కూడా రాకుండానే..
నంద్యాల ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా రాకుండానే చంద్రబాబు నంద్యాల్లో ఇంటింటికీ ఓ నాయకుడిని కేటాయించి ప్రచారం మొదలు పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికలపై ముందస్తు వ్యూహంతోనే సొంత పార్టీలో ఉన్నవారిని కాదని మరీ పార్టీ ఫిరాయించిన ముగ్గురికి మంత్రి పదవులిచ్చారు. ఇంకా చెప్పాలంటే  సీనియర్‌ నాయకుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి మరీ వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. అంటే తమ పార్టీ నుంచి గెలిచిన నాయకుల కంటే పక్క పార్టీలోనే బలమైన నాయకులున్నారనేగా. ఉన్నట్టుండి నంద్యాలలో  రుణాలంటూ ఇన్‌వాయిస్‌లు లేకుండా ట్రాక్టర్లు, కార్లు పంచి పెడుతున్నారు, ఇది  ఎన్నికల కోసం పంపకాలు షురూ చేసినట్టేగా. పార్టీ మారిన నాయకుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి. ప్రత్యర్థులను భయపెట్టాలన్న వ్యూహం తప్ప.  ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని విచ్చలవిడితనం చేసిందే బాబు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఇమేజ్‌ బిల్డింగ్‌ మీద దృష్టి పెట్టి. పేపర్‌ యాడ్లు, విదేశీ పర్యటనలు, ప్రముఖులతో ఫొటోలు, చనిపోయిన ప్రముఖుల పేర్లు చెప్పి వారి ఖ్యాతి వెనుక కారణం నేనే అని ఊదరగొట్టుకోవడం బాబుకే అలవాటైన విద్య. ఈ మూడేళ్లలోనూ అదే జరిగింది. బాబు చెప్పిన అభివృద్ధి అంతా పేపర్లలోనే కనపడుతోంది తప్ప.. సామాన్యుడికి ఒక పైసా లాభం చేకూర్చింది లేదు. కరువుతో రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే.. పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వలసబాట పడుతుంటే రెయిన్‌గన్‌లతో కాలక్షేపం చేశాడు తప్ప చేసిందేమీ లేదు. అందుకే బాబు జనాని కంటే డబ్బునే నమ్ముతున్నారు.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బాబుకు ఇప్పుడూ అదే పరాభవం తప్పదు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com