Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
ఉక్కు పరిశ్రమ ఎన్నికల స్టంట్‌
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

Published on : 09-Nov-2018 | 13:02
 

 

 వైయ‌స్‌ఆర్‌ జిల్లా : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ గడ్డం తీయడానికే సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తున్నారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రమేశ్‌ దీక్షా సమయంలో రెండు నెలల్లో పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తామని చెప్పారని, నిన్నటి ప్రొద్దుటూరు సభలో మరో నెల రోజుల్లో అని, కేబినెట్‌ మీటింగ్‌లో నెల రోజుల్లో అని ప్రకటించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో రాయలసీమలో తన ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు ఉక్కు కర్మాగారం కోసం పునాది రాయి వేయాలని నిర్ణయించాడే తప్ప, పరశ్రమపై చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక 16వ వార్డులోని ముస్లిం మైనారిటీ నాయకుడు దాదాపీర్‌ స్వగృహంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విధి విధానాలను ప్రకటించాలని కోరారు. ఇందుకు అవసరమైన రూ.18వేల కోట్లు బడ్జెట్‌లో  పెట్టకుండా, భూ సేకరణ చేపట్టకుండా,  అవసరమైన ఖనిజం ఎలా వస్తుంది, నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియకుండా పరిశ్రమ పెట్టడం అంత సులువా అని అన్నారు. కుందూ–పెన్నా పథకానికి సంబం ధించి 400 ఎకరాల భూమిని సేకరించేందుకే 11 ఏళ్లుగా ప్రభుత్వానికి చేతకాలేదని, అలాంటిది వేల ఎకరాల భూమిని ఇప్పటికప్పుడు ఏవిధంగా సేకరిస్తారన్నారు. పండుగపూట కూడా పాతమొగుడేనా అన్న చందంగా దీపావళి రోజున కూడా ప్రజలు చంద్రబాబు అబద్ధాలను వినాల్సి వస్తోం దన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏమి చేశాయని ప్రశ్నిం చారు. తీరా ఎన్నికల ముందు పునాది రాయి వేసి ఈ ప్రాంత వాసులను మభ్యపెట్టడానికి జిల్లా ప్రజలు ఏమైనా అమాయకులా అని అన్నారు.

 ఉక్కు పరిశ్రమ పేరుతో 11 రోజులపాటు సీఎం రమేశ్‌ ద్రవ రూపంలో ఆహారం తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఆ ప్రకా రం ఆయన గడ్డం మూరెడు అయి, బారెడు పెరుగుతుందని ప్రస్తుతం పునాది రాయి వేస్తున్నారన్నారు. సీఎం రమేశ్‌ కేశఖండన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడానికి టీడీపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. రూ.వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తారని, ఇన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఆర్థిక గణాంకాలు వేసి అందరిని భ్రమలో పెట్టే ప్రయత్నమే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఈ నాటకాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. సమావేశంలో వార్డు ఇన్‌చార్జి పాపిగారి నాగసుబ్బారెడ్డి, మార్కెట్‌ జాఫర్, వైయ‌స్ఆర్‌ సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, ఆటో నగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నన్నే సాహెబ్‌ పాల్గొన్నారు. 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com