Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆదివారం పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 317వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
రాజకీయాల్లో బాహుబలి వైఎస్సార్ - 9

Published on : 23-Feb-2018 | 17:56
 

2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు తన సొంత చిన్నాన్న ఇంటికి ఆశీస్సుల కోసం వెళ్ళినపుడు "వైఎస్సార్ లా పాలిస్తాను అని ప్రజలతో చెప్పు" అన్నారట. వైఎస్సార్ పాలనకు అంతకంటే ధ్రువపత్రం మరొకటి కావాలా? చెప్పుతో కొట్టినట్లు లేదూ ఆ పెద్దాయన మాట?

"ఈ ఎన్నికలలో నేను కొత్త వాగ్దానాలు ఏమీ ఇవ్వను. ఇప్పటివరకు నేను చేసిన పనులను చెప్పి ఓట్లు అడుగుతాను" అని ప్రకటించిన ఒక జాతీయపార్టీ ప్రాంతీయనేత ఎవరైనా ఉన్నారా?

"అభ్యర్థులను నేను సెలెక్ట్ చేస్తాను. నాకు ఆ అధికారం ఇవ్వండి. వారి గెలుపు ఓటములకు నేను బాధ్యత వహిస్తాను. మీకు ముప్ఫయి మూడు మంది ఎంపీలను ఇస్తాను. మీరు జోక్యం చేసుకోవద్దు" అని పార్టీ అధినేత్రి ముఖాన్నే స్పష్టం చేసిన సాహసి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా?

పాలించిన అయిదు ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంట్, రవాణా, నీటి, గృహ చార్జీలు పెంచకుండా పాలించిన దక్షుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్కరిని చూపించండి... అది సరే... మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే రాబోయే ఐదేళ్లలో కూడా చార్జీలు పెంచము అని రొమ్ము విరుచుకుని ప్రకటించిన యోధుడు ఎవరైనా ఉన్నారా?

తొలి సంతకం ఆయన చేసింది ఎవరి కోసం? టాటాలు, బిర్లాలు, అంబానీ, ఆదానీలకోసం కాదు. అన్నదాత కోసం. దేశానికి అన్నం పెట్టె రైతు కోసం. ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణంలోనే...రైతుల విద్యుత్ బకాయిలు ఒక్క కలం పోటుతో రద్దుచేసి పారేశారు. వ్యవసాయ పంపుసెట్లకు నాలుగున్నరేళ్ళపాటు నిరంతరాయంగా విద్యుత్ ను ఇచ్చిన ఘనత ఈ దేశంలో ఒక్క వైఎస్సార్ దే... వ్యవసాయ రంగానికి మొత్తం 1500 కోట్ల యూనిట్ల విద్యుత్ ను రైతులకు ఉచితంగా అందించిన అభినవ శిబి వైఎస్సార్. రుణమాఫీ వర్తించని వారు తమకు కూడా ఏదైనా చెయ్యండి అని అడగటమే ఆలస్యం...ముప్ఫయి ఆరు లక్షలమంది రైతులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున 1800 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఆయన!

ఇక భూమి పంపిణీ చెయ్యడంలో వైఎస్సార్ దే చరిత్ర. భూమిలేని పేదలకు ఆరు లక్షల నాలుగువేల ఎకరాలను పంపిణీ చెయ్యడమే కాక ఆరు లక్షల ఎకరాలలో గిరిజనులకు భూమి హక్కు కల్పించిన ప్రజాబంధు వైఎస్సార్.

చంద్రబాబు హయాంలో మాకు ఉన్న రేషన్ కార్డులను తొలగించారు. కార్డు ఉన్నవారికి షాపులో బియ్యం తప్ప ఏమీ దొరికేవి కావు. కానీ వైఎస్సార్ వచ్చాక మళ్ళీ రేషన్ కార్డులు వచ్చాయి. దాదాపు యాభై లక్షల రేషన్ కార్డులను పంచారు వైఎస్సార్.

అంతే కాదు. చేనేత కార్మికులు గతంలో ఎన్నడూ లేనంత లభ్డిని వైఎస్సార్ పాలనలో పొందారు. మొత్తం 327 కోట్ల రూపాయల చేనేత రుణాలను రద్దు చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నెలరేడు వైఎస్సార్.

చంద్రబాబు పాలనలో అరడజను సార్లు చార్జీలు పెరిగాయి. కరెంట్ మోతలు మోగిపోయాయి. వరుసగా ఏడేళ్లు కరువు విలయతాండవం చేసింది. వరుణ దేవుడు ఎక్కడికి పారిపోయాడో తెలియదు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే వరుణదేవుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టాడు! వైఎస్సార్ పాలించిన ఐదేళ్లు రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు నిండు గర్భిణీలు అయ్యాయి. వద్దంటే వర్షాలు... నీటి కరువు అన్నది లేదు. వ్యవసాయం మళ్ళీ నర్తించింది. రైతులు ఆనందంతో పొంగిపోయారు. బహుశా.. ఆ పరిస్థితులను తలచుకునేమో మళ్ళీ చార్జీలు పెంచము అని వైఎస్సార్ చెబితే ప్రజలు ఆనందడోలికల్లో మునిగిపోయారు.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు అధికారం మాత్రం ఇందిరాగాంధీ, సోనియాగాంధీ బొమ్మలు చూసి రాలేదు. వైఎస్సార్ ను చూసి వచ్చింది. వైఎస్సార్ ప్రజారంజక పాలనను చూసి రెండోసారి వచ్చింది. ఈ గెలుపుతో వైఎస్సార్ అరివీర భయంకరుడు అయ్యారు. ఒక ప్రాంతీయ నేతను చూసి అధిష్టానం భయపడటం ఒక్క వైఎస్సార్ విషయంలోనే సంభవం అయింది.

అసలు ఇన్నిన్ని పధకాలను ఎలా ప్రారంభించారు? ఎలా అమలు చేశారు? దివాళా తీసిన రాష్ట్రంలో ఈ అద్భుతాలు ఎలా సంభవం అయ్యాయి? ఆయన పరిపాలనా సామర్ధ్యం ఏమిటి? అని ఒక్క మేధావి అయినా ఆలోచించాడా? ఊరికే లక్ష కోట్లు కాజేసాడు.. అవినీతి చేసాడు.. రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని ఆంబోతుల్లా రంకెలు వెయ్యడం తప్ప? గాడిదల్లా ఓండ్రపెట్టడం తప్ప?

ఎవడేమనుకున్నా... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్సార్ పాలన స్వర్ణయుగం...రత్నయుగం...వజ్రయుగం... ఈ వాక్కుకు తిరుగు లేదు.

(సశేషం)

రచన  ఇలపావులూరి

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com