Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
రాజకీయ బాహుబలి వైయస్ ఆర్ - 6

Published on : 14-Feb-2018 | 12:53
 


తన మంత్రివర్గంలో ఒకేసారి ఆరుగురు మహిళలకు, అందునా అయిదుగురు తెలంగాణ మహిళలకు.. అవకాశం ఇచ్చిన రాజకీయ మొనగాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఉన్నారా?  

దాదాపు ముఖ్యమంత్రి తరువాతి స్థానం అని చెప్పుకోదగిన హోమ్ మంత్రిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చిన ధీరుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఉన్నారా?  

ఇద్దరు ఆడపిల్లల మీద ఆసిడ్ దాడి చేసిన దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయించిన సాహసి భారతదేశంలో ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? 

డాక్టర్ వైయస్ ఆర్ తప్ప!  

ఏమా ధైర్యం! ఏమా గద్దరితనము!!

ఆడపడుచులను లక్షాధికారిగా చేస్తానన్న అనురాగమూర్తి, మహిళా సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ అయినా డోంట్ కేర్ అన్న తెంపరి...ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ తప్ప మరొకరిని ఉదాహరణకు కూడా చెప్పుకోలేము.  

ఇంటికి దీపం ఇల్లాలు అన్న ఆర్యోక్తిని ఆకళింపు చేసుకున్న మహనీయుడు వైయస్ఆర్. మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను తెలుగింటి ఆడపడుచుల హృదయాల్లో స్వయంభూగా ప్రతిష్టింపజేశాయి. 

హోమ్ శాఖను ఇచ్చినపుడు సబితా ఇంద్రారెడ్డి విచలితురాలై పోయారు.  అప్పుడు వైయస్ఆర్ 'నీకు నేను అండగా నిలబడతానమ్మా"  అని ధైర్యాన్ని నూరిపోశారు.  ఆమెచేత కాంప్ ఆఫీసులో కిలో రెండురూపాయల బియ్యం పధకాన్ని మొదలు పెట్టించారు.  ఒక ముఖ్యమంత్రి తన మంత్రితో తన సమక్షంలో ఒక ప్రభుత్వ పధకాన్ని ప్రారంభింపజెయ్యడం ఇండియాలో ఎక్కడైనా జరిగిందా? 

పేదలకోసం ఇందిరమ్మ ఇళ్లను కట్టించారు.  మగవాళ్ళైతే దుర్వినియోగం చేస్తారని తలచి ఆ ఇళ్లను ఆ ఇంటి ఇల్లాళ్ల పేరు మీద రిజిస్టర్ చేయించారు. మహిళల పేరుమీద పట్టాలు ఇప్పించారు.  పావలా వడ్డీకి మహిళలకు రుణాలు ఇచ్చి వారిపాలిటి భగవంతుడు అయ్యారు.  ఇందిరాక్రాంతి పధకాన్ని ప్రవేశపెట్టి అభయహస్తం పేరుతో ఈ పధకంలో చేరిన వారికీ నెలకు అయిదు వందల రూపాయల కనీస ఫించన్ వచ్చేట్లుగా ఏర్పాటు చేశారు.  వైయస్ఆర్ ముందు చూపు ఎలాంటిది అంటే తాను ఉన్నా లేకపోయినా, తన పధకాలను మార్చకుండా, రద్దు చెయ్యకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.  ఈ పథకాలన్నీ మాటలకే పరిమితం అని ఏకసక్కేలు ఆడినవారందరి నోళ్లను మూయిస్తూ అన్నీ ఆచరించి చూపించిన ధీశాలి వైయస్ఆర్!  

ఆడపడుచులకు ఆత్మబంధువు అనిపించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక్క వైయస్ఆర్ మాత్రమే చరిత్రలో కనిపిస్తారు.  

ఆయనకు తల్లి అంటే వల్లమాలిన ప్రేమ.
భార్య అంటే అంతులేని అనురాగం
కూతురు అంటే అలవిమాలిన ప్రేమ.  

తన కుటుంబాన్ని ప్రేమించేవాడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు.  అందుకే వైయస్ఆర్ రాష్ట్రంలోని మహిళలందరిని తన కుటుంబసభ్యులుగా భావించి మన్నించారు.  నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ...తల్లి... లాంటి పదాలు ఆయన పెదవుల నుంచి జాలువారుతుంటే పులకరించని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 

పులివెందుల సమీపంలో వైయస్ ఆర్  కుటుంబానికి పదిహేను ఎకరాల తోట ఉన్నది.  నీటి కరువు కావడంతో పార్నపల్లి వాగు ఒడ్డున బోరు వేసి పైపులద్వారా తోటకు నీరు అందే ఏర్పాటు చేసారు వైయస్ఆర్.  తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామ మహిళలు ఆ పైపులకు రంధ్రాలు వేసి నీళ్లు పట్టుకోసాగారు.  అది చూసిన వైయస్ఆర్  తల్లి జయమ్మ "తోట ఎండిపోతున్నది రాజా... వాళ్లకు చెప్పరాదా" అని అన్నారు.  "నీళ్ళే కాదమ్మా... మనుషుల ప్రాణాల కంటే చెట్లు చేమలు ఎక్కువా?  పట్టుకొనిలే  అమ్మా"  అన్నారు వైయస్ఆర్..

పాదయాత్ర చేస్తున్నపుడు కొడుకు యోగక్షేమాలు కనుక్కోవాలని జయమ్మ వెళ్లారు.  కాళ్ళకు బొబ్బలు, నల్లబడిన కొడుకు ముఖాన్ని చూసి చలించిపోయిన ఆమె కన్నీళ్లు పెట్టుకుని "ఎందుకురా నీకీ అవస్థలు"  అని బాధపడ్డారు.  "ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.  మంచినీళ్ళకోసం ఆడబిడ్డలు కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు.  వారు పడుతున్న శ్రమ ముందు నా కష్టం ఎంత?  నాకేమీ కాదులే" అని తల్లిని ఓదార్చి పంపారు ఆయన. 

మహిళలను అంతగా ప్రేమించిన ముఖ్యమంత్రి భూప్రపంచంలోనే లేడు.  ఇంతమంది ప్రేమలు ఆయనకు దీర్ఘాయుసు ఇవ్వకపోవడమే అత్యంత దురదృష్టకరం.

రచన: ఇలపావులూరి 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com