Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిపక్షనేత కాలిగోటికి కూడా బాబు సరిపోడుః భూమన                               కాకినాడ ప్రజలారా... టీడీపీ పగటి వేషగాళ్లు వస్తున్నారు జాగ్రత్తః బొత్స                               నంద్యాలలో టీడీపీ ఓటుకు నోటు రాజకీయాలుః పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు                               వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత ముస్తాక్                               నంద్యాలలో వైయస్సార్సీపీకి అక్కినేని, సూపర్ స్టార్ క్రిష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు                               ప్రభుత్వం మీది, అధికారంలో ఉన్నారు..ఏ విచారణ అయినా వేసుకోండిః బాబుకు శిల్పా సవాల్                               తప్పుడు ఆరోపణలతో వ్యకిత్వం దెబ్బతీయడం సరికాదుః శిల్పా మోహన్ రెడ్డి                               తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు, దుష్ర్పచారం మానుకోవాలని టీడీపీకి హెచ్చరిక                 
    Show Latest News
వైయస్ జగన్ తో పయనించండి

Published on : 11-Aug-2017 | 17:07
 

నంద్యాలః చంద్రబాబు మోసానికి కాదేది అనర్హం అనే రీతిలో మహిళలు,నిరుద్యోగులు, రైతులు అందరినీ మోసం చేశాడని వైయస్సార్సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను అడుగడుగునా వంచిస్తున్నాడని అన్నారు. రజక, నాయి బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లపై అర్థరాత్రి దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ, వాల్మీకిల ఆత్మీయ సదస్సు పెట్టి టీడీపీ సదస్సుగా మార్చాడని రామయ్య బాబుపై విమర్శలు గుప్పించారు. బీసీ సబ్ ప్లాన్ కు 10వేల కోట్లు ఇస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. బాబు మాటలకు, చేతలకు పొంతన లేదని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి బాబు ఆనందిస్తున్నారని రామయ్య మండిపడ్డారు.  మాల, మాదిగలకు..పులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టాడని బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తో పయనించాలని రామయ్య నంద్యాల ప్రజలకు సూచించారు. మోసపోయే పరిస్థితి ఉండదని,  మాట ఇస్తే తప్పని వ్యక్తి జగన్ అన్న సంగతి గుర్తెరగాలన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు వైయస్ జగన్ చిత్థశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com