Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                 
    Show Latest News
పోటెత్తిన బాపట్ల

Published on : 13-Mar-2018 | 11:44
 



- గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- జ‌న‌నేత‌కు బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
గుంటూరు: రాజన్న బిడ్డ రాకతో బాపట్ల గడ్డ పులకించింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపుతోంది. ఆప్యాయత, అనురాగాలు జోడించి జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 12న గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది. బాపట్ల మండలంలోని స్టువర్టుపురం వద్ద ఉదయం 9.08 గంటలకు యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌చేశారు. జ‌న‌నేత‌కు ప‌ల్నాడువాసులు బ్రహ్మరథం ప‌ట్టారు. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జగన్‌కు జేజేలు పలికారు. ప్ర‌జాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో అడుగుపెట్ట‌గానే వైయ‌ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుట రైతులు త‌మ ఆవేద‌న‌ను చెప్పుకున్నారు.  కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక సతమతమవుతున్న సామన్యులు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రాజన్న బిడ్డకు తమ గోడు వినిపించారు. జనసంద్రమైన దారుల మధ్య కన్నీటి గాథలు, బతుకు వెతలు వింటూ, వారికి భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగారు. నిన్న సాయంత్రం బాప‌ట్ల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాది ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌డంతో జ‌న‌సంద్ర‌మైంది. ఇవాళ ఉద‌యం బాపట్ల శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ఆరంభించారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారి పాలెం క్రాస్‌, అప్పికట్ల, పూండ్లక్రాస్‌ మీదగా ఈతేరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈతేరులో వైయ‌స్‌ జగన్‌...ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,484.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాద‌యాత్ర దారుల‌న్నీ జ‌నంతో కిక్కిరిపోతున్నాయి. ఎర్ర‌టి ఎండ‌ను సైతం ప్ర‌జ‌లు లెక్క చేయ‌కుండా అభిమాన నేత వెంట అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com