Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు వివాదంపై వైయస్సార్సీపీ కమిటీ                               నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి                                ముస్లిం సోదరులకు వైయస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు                               మతిస్థిమితం లేని వ్యక్తి సీఎం పదవికి అనర్హుడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               తెలుగు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఛీదరించుకుంటున్నారుః వెల్లంపల్లి శ్రీనివాస్                               వైయస్‌ఆర్‌సీపీ నీతివంతమైన పార్టీ...తెలుగుదేశం భూతువంతమైన పార్టీః గుడివాడ అమర్నాథ్                                ముఖ్యమంత్రి ఎన్ని అవమానాలకు గురి చేసినా తన నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తాః ఐజయ్య                               తన మైక్‌ కట్‌ చేయించి సీఎం చంద్రబాబు తనను అవమానపరిచాడుః ఎమ్మెల్యే ఐజయ్య                               నారా చంద్రబాబు నాయుడు...సారా చంద్ర "బార్" నాయుడుగా మార్చుకుంటే బాగుంటుందిః రోజా                 
    Show Latest News
వైయస్‌ జగన్‌ సీఎం కావాలని పాదయాత్ర

Published on : 11-Jan-2017 | 15:44
 

తిరుమల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వైయస్సార్సీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. వైయస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజవర్గం ఓబులవారిపల్లె  మండలానికి చెందిన 800 మంది చేపట్టిన పాదయాత్ర తిరుమల చేరుకుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ జయపాల్‌రెడ్డి నేతృత్వంలో వీరు గోవిందమాల ధరించారు. సోమవారం ఉదయం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభించి అన్నమయ్య కాలిబాట మీదుగా మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. దాదాపు అందరూ శ్రీవారికి తలనీలాలు సమర్పించి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు. రైతుల గురించే ఆలోచించే నాథుడు లేడన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటి పాలన మళ్లీ వస్తుందన్నారు. ఇందుకోసం తాము పాదయాత్రగా వచ్చి తిరుమలలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు పార్టీ నాయకుడు జయపాల్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

Egreetings YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha