Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                  
    Show Latest News
ఓటమి భయంతో ప్రలోభాలు

Published on : 15-Jul-2017 | 12:05
 

నంద్యాల: ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో ఉన్న అధికార పార్టీ నేతలు పదవులు, కాంట్రాక్టులు, ఇస్తామని వైయస్సార్సీపీ నేతలను మభ్యపెట్టి, తమ శిబిరంలో చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కైపరాముడు, మార్కెట్‌ అభివృద్ధి కమిటీ నేత కరీంభైలను మభ్యపెట్టడానికి యత్నించగా, వారు వైయస్సార్సీపీని వీడేది లేదని ఖరాకండిగా తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నేతల పరువు కుందూలో కలిసిపోయింది. మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి నియోజకవర్గంలోని గోస్పాడులో పట్టు ఉన్న నేత. గతంలో వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి సాధించిన విజయాల్లో ఆయన కీలకపాత్ర వహించారు. దీంతో ఆయనను టీడీపీలో చేర్చుకోవడానికి అధికార పారీ నేతలు పన్నాగం పన్నారు. పీపీనాగిరెడ్డికి సమీప బంధువు మంత్రి ఆదినారాయణరెడ్డిని రంగంలోకి దింపి, మంతనాలు జరిపి, పదవులు ఇస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను వైయస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని పీపీనాగిరెడ్డి తేల్చి చెప్పడంతో మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నం బెడిసి కొట్టింది. తాను టీడీపీ విధానాలు నచ్చకనే వైయస్సార్సీపీలో చేరానని, మళ్లీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. తాను శిల్పా విజయానికి కృషి చేస్తానని చెప్పారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కైపరాముడును కూడా ప్రలోభాలకు ఆకర్షించడానికి మాజీ మంత్రులు ఫరూక్, కేఈ ప్రభాకర్‌ ప్రయత్నించారు. వీరిద్దరు ఆయన ఇంటికి వెళ్లి పదవులను ఎరగా చూపి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే రిటైర్డు ఉద్యోగిగా విశ్రాంతి తీసుకుంటున్న తనను చైర్మన్‌గా చేసిన శిల్పామోహన్‌రెడ్డిని వదిలిపెట్టి రానని తేల్చి చెప్పారు. దీంతో వీరు కూడా నిరాశగా వెనుదిరిగారు. రెండు రోజుల క్రితం మంత్రి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, టీడీపీ మైనార్టీ నేత డాక్టర్‌ నౌమాన్, గుడిపాటి గడ్డలోని కూరగాయల మార్కెట్‌ అభివృద్ధి కమిటీ నేత కరీంభైని కలిసి పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది. జుమ్మా మసీదు అభివృద్ధికి రూ.50లక్షల నిధులు ఇస్తామని, కమిటీని నియమిస్తామని, పోలీసు కేసులు ఎత్తివేస్తామని మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా వెంటనే ఉంటానని చెప్పారు. వ్యక్తిగతంగా తాను శిల్పాకు మద్దతు ఇస్తానని, జమాతేలో ఉన్నందున ప్రచారం చేయనని చెప్పారు. దీంతో మంత్రి కాల్వ శ్రీనివాసులతో పాటు ఇద్దరు నేతలు కూడా చేతులు ఊపుకుంటూ వెనుదిరిగారు. టీడీపీ నేతలు వైయస్సార్సీపీ నేతలను మభ్యపెట్టడానికి ప్రయత్నించడం, షాక్‌నిస్తుండటంతో అధికార పార్టీ నవ్వులపాలవుతుంది.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com