Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాగోలు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 318వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
దుబారాకు లోటు లేదు

Published on : 09-Aug-2018 | 16:05
 – పేద రాష్ట్రం అంటూనే విచ్చలవిడి ఖర్చులు
– ఖజానాపై భారం మోపుతున్న చంద్రబాబు 
– కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైతే రూ. 8.72 లక్షల ఖర్చు
– బిత్తరపోయిన కుమారస్వామి సర్కారు


 గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదన్నట్టు..  ఒకపక్క రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో  ఉందంటూనే మరోపక్క చంద్రబాబు విచ్చలవిడి ఖర్చులకు ఏమాత్రం వెనకాడటం లేదు. సొంత పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ పర్యటనలు, హోటల్‌ ఖర్చులు, ఇంటి మరమ్మతులు, సొంతంగా ప్రత్యేకమైన బస్సు.. ఇలా చంద్రబాబు చేసే ప్రతి పనివెనుకా చేసిన ఖర్చుల గురించి ఆలోచిస్తే కేవలం పబ్లిసిటీ కోసం.. పది మందిలో తానే ప్రత్యేకంగా కనిపించాలని తపనపడే స్వభావం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నవ నిర్మాణ దీక్షలు, ఉక్కుదీక్ష, ధర్మ పోరాట సభలు, జన్మభూమి, ప్రత్యేక కార్యక్రమాలు, జలహారతి... లాంటి కార్యక్రమాలు అన్నీ కలుపుకుంటే.. చంద్రబాబు ఖజానాను లూఠీ చేసిన విషయం కళ్లు బైర్లు కమ్ముతోంది. పెట్టుబడులు తీసుకొస్తానంటూ ఆయన 13 దేశాల్లో 21 సార్లు పర్యటించారు. శంకుస్థాపన ఖర్చులు, విదేశీ కన్సల్టెంట్‌లకు ఫీజుల చెల్లింపులు, ఆయన ఇళ్ల నిర్మాణం, మరమ్మతులు, అన్నీ కలుపుకుంటే బాబు నాలుగేళ్లలో బాబు ఖర్చులు 2620 కోట్లకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు. 
పరామర్శలకు కూడా భారీ ఖర్చు..
అభివృద్ధి పేరు చెప్పి చంద్రబాబు ఇంత భారీగా ఖర్చుచేస్తే పరామర్శల పేరిట ప్రముఖులు చనిపోయినప్పుడు వెళితే ఆ భారం కూడా ప్రజలపైనే. అది కూడా భరించలేనంతగా. ఈ మధ్యనే కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు అయిన ఖర్చు చూసి వారు బిత్తరపోయారు. ఆయనకు అక్షరాలా రూ. 8,72,485 ఖర్చయింది. ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు రూ. 1.67 లక్షలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు రూ. 1.02 లక్షలు, సీతారాం ఏచూరి రూ. 64 లక్షలు ఖర్చయ్యాయి. చంద్రబాబు దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు చేయగా.. మిగతా అందరికీ రెండు లక్షలు కూడా దాటలేదు. ఈ ఖర్చు కర్నాటక ప్రభుత్వం చూసుకున్నప్పటికీ.. మిగతా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇతర కేంద్ర మాజీ మంత్రులు, జాతీయ నాయకులకు చంద్రబాబుకు పెట్టినంత ఖర్చు కారకపోవడం గమనార్హం. పక్కనే ఉన్న బెంగళూర్‌కు వెళితేనే చంద్రబాబు వారితో ఇంత ఖర్చు పెట్టించాడంటే.. ఏ కశ్మీరో, ఢిల్లీ, రాజస్థాన్‌ అయితే వారు భరించడం కష్టమైపోయేదే. ఈ లెక్కన చూసుకుంటే మొన్న జయలలిత చనిపోయినప్పుడు.., నిన్న కరుణానిధి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మన ప్రజలపై ఎంత భారం వేసుంటాడో అని అనుమానం రావడం మామూలే.  
Labels : chandra babu, tdp, cm, tours

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com