Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు ఇసుక మాఫియాను ప్రోత్సహించి చిత్తూరులో 16 మందిని పొట్టనబెట్టుకున్నాడుః బొత్స                               ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినోళ్లకు దొడ్డిదారిన కాంట్రాక్టులు కట్టబెడుతున్న చంద్రబాబుః బొత్స                               గుంటూరు జిల్లా మిర్చీయార్డు సమీపంలో చురుగ్గా రైతుదీక్ష ఏర్పాట్లు                               మే 1,2 తేదీల్లో వైయస్ జగన్ రైతు దీక్ష                               అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైయస్సార్సీపీ                               ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్                               అధికార పార్టీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారుః వైయస్ జగన్                               స్వర్ణముఖి నదీతీరంలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారుః వైయస్ జగన్                               ఏర్పేడు దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉంది..సీబీఐతో విచారణ జరిపించాలిః వైయస్ జగన్                 
    Show Latest News
పార్కుల ధ్వంసం తగదు

Published on : 09-Jan-2017 | 18:17
 

మదనపల్లె: పట్టణ నడిబొడ్డున ఉన్న రామ్‌నగర్‌ పార్కు జోలికి ఎవరైన వస్తే రణరంగమేనని వైయస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గుండ్లూరి షమీం అస్లాం మున్సిపల్‌ పాలకులు, అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు పలువురు క్రీడాకారులు చేపట్టిన ఆందోళనకు షమీం అస్లాం, కౌన్సిలర్‌ నీరుగట్టు వెంకటరమణారెడ్డి , మైఫోర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్‌లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రామ్‌నగర్‌ పార్కులోని క్రికెట్‌ క్రీడామైదానాన్ని  తొలగించి పార్కును అభివృద్ధి చేయాలన్న నిర్ణయం మున్సిపల్‌ పాలకులు , అధికారులు తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. 2005–10 సంవత్సరాల మధ్యలో దాదాపు రూ.20లక్షల ఖర్చుతో రామ్‌నగర్‌ పార్కులో షటీల్, టెన్నీస్, క్రికెట్‌ గ్రౌండ్‌ నిర్మించడం జరిగిందన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన ప్రభుత్వం అభివృద్ధి పేరుతో క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణంలో రామారావుకాలనీ, ఎన్‌విఆర్‌ లేవుట్, పీఎన్‌టీకాలనీ తదితర ప్రాంతాల్లో పార్కులను మరింత అభివృద్ధి చేయాల్సివుండగా అభివృద్ధి జరిగిన పార్కులను ధ్వంసం చేయడం తగదన్నారు. పార్కుల అభివృద్ధి పేరుతో నాశనం చేయాలనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు క్రీడకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com