Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
జలహారతి కాదు ధనహారతి

Published on : 14-Sep-2017 | 11:40
 

  • ప్రజల సొమ్ముతో చంద్రబాబు పబ్లిసిటీ
  • జలసిరి హారతి పేరుతో జిల్లాకు 20లక్షల ఖర్చు
  • పదివేలు కూడా ఖర్చు ఉండని చోట లక్షల రూపాయిల దోపిడీ
  • ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ అందినకాడికి దండుకోవడమే 
జలసిరి హారతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు ఎపి సిఎమ్ చంద్రబాబు. వాగులు, వంకలు, కుంటలు ఇలా ఎక్కడపడితే అక్కడ జలసిరికి హారతి పేరుతో మెదలు పెట్టిన కార్యక్రమానికి కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టారు. అదేంటి హారతి కార్యక్రమానికి మహా అయితే ఒక పదివేలు ఖర్చు ఉంటుంది. సిఎమ్ చంద్రబాబు కనుక, ఆయన అడుగుపెట్టిన చోట కాస్త అట్టహాసం చేసారనుకున్నా పాతికవేలు ఖర్చు తేలాలి. కాని కోట్లఖర్చు ఎందుకయ్యినట్టు అని మీరు ప్రశ్నేస్తే  అమాయకత్వం బైటపడుతుంది. జలసిరికి హారతి అంటూ పేపర్లలో, టివిల్లో ఇచ్చిన భారీ భారీ ప్రకటనల ఖర్చంతా ఎపి ప్రభుత్వమే కదా భరించేది. ఫ్రంట్ పేజీల్లో నిలువెత్తు యాడ్స్, కటౌట్లు, ఛానెళ్లలో హోరెత్తించడాలు ఇవన్నీ కలిసి ప్రజాధనాన్ని హారతి కర్పూరంలాగే కరిగించేసాయి. దీనికే ఆయన తోకపత్రికల్లోన జలసిరి హారతి విజయవంతం అంటూ ఊదరగొట్టాయి. హారతి విజయవంతం అవటం ఏమిటో ఆ రాతలు రాసిన వారికే తెలియాలి. అంటే హారతి పేరుతో జరిగిన లూఠీ విజయవంతం అయ్యిందని వారి పరిభాష కాబోలు. బాబు అండ్ కో ఇంకా ఆయన రంగు పార్టీలదంతా ఒక రకమైన కోడ్ భాష మరి. చంద్రబాబు పలికిన చిలక పలుకులను యథా తథంగా అప్పగించడం, ఆయన మాయలను మహాద్భుతాలుగా వర్ణించడం వారి కోడ్ భాష తెలిసిన వారికే సాధ్యం.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జలసిరి కార్యక్రమానికి జిల్లాకు 20లక్షలు కేటాయించినట్టు సమాచారం. ఇలా ప్రజాధనాన్ని సొంత పబ్లిసిటీకి వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ప్రాజెక్టులు పూర్తి అవ్వకపోయినా పూర్తయిపోయిందంటూ ప్రారంభోత్సవం చేయడం బాబు దుర్నీతి. ఒకసారి ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టుకే మళ్లీ మళ్లీ ఉత్సవాలు చేయడం ఆయన మతిమరుపు కాదు, ప్రజలు ఏదైనా తొందరగానే మరిచిపోతారనే ఆయన నమ్మకం. ఇంతకీ జలసిరి హారతి బాబు చేసిందేంటయ్యా అంటే ప్రతిపక్షపార్టీ నా పనులకు అడ్డుకుంటోంది, నా సంక్షేమానికి అడ్డుతగులుతోంది అని అవే విమర్శలు గుప్పించడం. కనీసం కళ్లముందు హారతి ఇచ్చేటప్పుడైనా నిజాలు మాట్లాడటం చంద్రబాబు నైజంలోనే లేదు. నిప్పుముందే తప్పులు చేయగల సమర్ధుడు బాబు అని జలసిరి హారతిలో జనాలకు బాగా అర్థం అయ్యి ఉంటుంది. 

నీళ్లకు రంగుపూద్దామనుకుంటున్న చంద్రబాబు 
తెలంగాణ సిఎమ్ కేసిఆర్ మెన్నామధ్య సాగర్ కు గులాబి రంగు పూసారు. అంటే ప్రాజెక్టులు కూడా తమ పార్టీ రంగులోనే ఉండాలని భావించినట్టున్నారు. అలా చేసినందుకు ప్రజలు, ప్రతిపక్షాలూ ఆయన్ను దుమ్మెత్తిపోసాయి. అది చూసి కూడా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోలేదు. కాపీల్లో అసలే కింగ్ కదా తెలుగు దేశం సిఎమ్. తెలంగాణా ముఖ్యమంత్రి చేసినట్టే మన రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు పచ్చరంగు పులిమేద్దాం అనుకున్నార్ట. త్వరలో ఆపని గానీ మొదలెడతారేమో చూడాలి. 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com