- రైతు సమస్యలపై చర్చకు భయపడి పారిపోయిన బాబు
- ముఖ్యమంత్రి పదవిని భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు
- ధరల స్థిరీకరణ నిధి ఏమైంది..?
- దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతు శ్రేయస్సు పట్టదా..?
- కాళ్లబేరం బాబు నైజం.. వైయస్ జగన్‌ది కాదు
- వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: చంద్రబాబు రైతు వ్యతిరేకి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. జీఎస్టీ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా.. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుతో పాటు రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సూచించారని చెప్పారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారి సమస్యలపై చర్చిద్దాం.. అవకాశం ఇవ్వండి.. అసెంబ్లీని ఒక్కరోజు కాకుండా నాలుగు రోజులు పాటు పొడిగించైనా కులంకుశంగా చర్చించాలని వాయిదా తీర్మాణం ఇస్తే దాన్ని తోసిపుచ్చారన్నారు. అయినా రైతాంగ సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం వెనుకడుగువేసిందన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ బండారం బయటపడుతోందని పలాయనం చిత్తగించిందన్నారు.
మూడు సంవత్సరాలైంది స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఎక్కడా?
ఎన్నికల సమయంలో రైతుల పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారస్సులను అమలు చేస్తామని, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.. అవన్నీ ఏమైపోయాయని కాకాణి చంద్రబాబును ప్రశ్నించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీకు బాధగా లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలో వ్యవసాయం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇప్పటి వరకు అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నారు. వాటిల్లో ఒక్కసారైనా రైతుల సమస్యలపై చర్చించారా అని ధ్వజమెత్తారు. ఎంతసేపు రైతులు భూములు ఎలా లాక్కోవాలి... లాక్కున్న భూమిని ఏ విధంగా పారిశ్రామిక వేత్తకు అప్పగించి ముడుపులు సాధించాలనే ఆలోచన తప్ప రైతాంగ శ్రేయస్సు, మద్ధతు ధర గురించి ఆలోచనే లేదన్నారు.
ప్రధానిని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాలా..?
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దిగజార్చుతూ, భ్రష్టుపట్టిస్తున్నాడని కాకాణి విమర్శించారు. ప్రధానిపై నేరుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేయండి అని స్వయానా ముఖ్యమంత్రి చెప్పడం నీచం అన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రధానిని కలవడంతో టీడీపీలో కలవరం మొదలైందన్నారు. ఏ విధంగా వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని ప్రభుత్వం కాచుకొని కూర్చుందన్నారు. కేసుల గురించి ప్రధాని దగ్గర వైయస్ జగన్ కాళ్లబేరం ఆడారని మాట్లాడుతున్న టీడీపీ నేతల వ్యాఖ్యాలను కాకాణి ఖండించారు. చంద్రబాబులా కాళ్లబేరమాడే వ్యక్తిత్వం వైయస్ జగన్‌కు ఉంటే ఇన్ని అక్రమ కేసులు, ఇబ్బందులు ఉండేవి కావని స్పష్టం చేశారు. ఆత్మగౌరవ నినాదంతో సోనియాగాంధీ లాంటి వ్యక్తిని ఢీ కొనడం వల్లే కష్టాలు కొని తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేక ప్రతిపక్షంపై బురదజల్లుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రికి, మంత్రులకు చిత్తశుద్ధి లేదన్నారు. రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.