Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             తెలుగుదేశం పార్టీ నేతల ధనార్జన పథకంగా ఇసుక మాఫియా తయారైందిః బొత్స                               మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబు?: బొత్స                               అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన విరాజిల్లుతోందిః బొత్స సత్యనారాయణ                               శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర ప్రారంభం                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                 
    Show Latest News
ప్రభుత్వ భూదాహంతో రోడ్డున పడిన అన్నదాత

Published on : 21-Apr-2017 | 18:26
 

నూజెండ్లలో రైతులను పరామర్శించిన బొల్లా
నూజెండ్ల: అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌హైవే క్రింద భూములు కోల్పోయిన రైతులకు పోలవరం నిర్వాసితుల మాదిరిగానే ఎకరాకు 44 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నియోకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన నూజెండ్లలో ఎక్స్‌ప్రెస్‌హైవే క్రింద భూములు కోల్పోతున్న రైతులను ఆయన కలిశారు. నూజెండ్ల, బుర్రిపాలెం, అప్పాపురం, గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు బొల్లా వద్దకు చేరుకుని సమస్యను తెలియజేశారు. రైతులు కోల్పోతున్న భూములను పరిశీలించిన అనంతరం బొల్లా మాట్లాడుతూ ప్రభుత్వం భూదాహంతో వేలాది ఎకారాలు భూసేకరణ పేరుతో రైతుల పొట్టలు కొడుతుందని విమర్శించారు. హైవే జంక్షన్‌ నెపంతో నూజెండ్ల లక్ష్మీపురం ప్రాంతంలో రోడ్డుకు కాకుండా మరో 250 ఎకరాలు సేకరించడం దారుణమన్నారు. ఎప్పుడో భూమి అవసరం వస్తుందని ఇప్పుడే రైతుల వద్దనుంచి భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 రైతులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా పొలాలల్లో జెండాలను పాతడంతో రైతులు దిగులుతో అల్లాడుతున్నారన్నారు. రోడ్డుక్రింద పూర్తిగా పొలాలు పోయిన రైతులకు నష్టపరిహారంతో  పాటు భూములను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల అన్నదాత రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూజెండ్ల రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈనెల 26,27 తేదీలల్లో జగన్‌ తలపెట్టిన రైతు దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షనేత జగన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి రైతులపక్షాన పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేసేలా పోరాటం చేస్తామన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే నోరు మెదపక పోవటమేమిటని దుయ్యబట్టారు. అధికారులు కూడా నష్టపరిహారంపై రైతులకు స్పష్టత నివ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండలకన్వీనర్‌బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌మెంబరు గంధం బాలిరెడ్డి,దండు చెన్నయ్య, కుర్రాపాపిరెడ్డి, శ్రీరామినేని రమేష్, చిరంజీవి, రామకృష్ణారెడ్డి, లతోపాటు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com