Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                 
    Show Latest News
సంధిప్రేలాపన

Published on : 17-May-2018 | 17:17
 


మంచాన ఉన్న మనిషి మరణించే ముందు సంధి ప్రేలాపన చేస్తాడట. అకారణంగా తిట్టడం, సొంత గొప్పలు చెప్పుకోవడం, చేసిన తప్పుల పై వగచడం, క్షమాపణలు చెప్పడం, తన వారసుల ముందు చివరి కోరికలు  బైటపెట్టడం లాంటివన్నీ చేస్తుంటారట. చంద్రబాబు అధికార అంత్య దశలో అలాంటి సంధి ప్రేలాపనలే ఆడుతున్నాడు. అధికారులను సోమరిపోతులని,  అవినీతి పరులనీ అరుస్తున్నాడు. శ్రీకాకుళంలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన బాబు బహిరంగ సభలో అన్న మాటలు వింటే అవి అచ్చం అధికారాన్ని కోల్పోయే భయంలో చెబుతున్న అడ్డదిడ్డమైన మాటల్లాగే ఉన్నాయి. 

ఆయన అవినీతి గురించి ప్రపంచం పదే పదే మాట్లాడుతుంటే, ఆయనేమో అధికారులనే సోమరిపోతులూ, అవినీతిపరులంటూ నెపాన్ని వారిపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇసుక అక్రమాల గురించి నోరెత్తకుండా, ఇసుక దందా చేస్తున్న వారిమీద కనీస చర్యలు తీసుకోకుండా ఉచిత ఇసుకను ఇచ్చినా దందా జరుగుతోందని అమాయకంగా వాపోతున్నట్టు నటిస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరడ్డుకున్నా 1100 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచన కూడా చేసారు. ఇసుక దందా అడ్డుకున్న తహసిల్దార్ వనజాక్షిని ముఖ్యమంత్రే స్వయంగా పిలిపించి బెదిరించి, కాంప్రమైజ్ చేసి, కేసు లేకుండా చేసినట్టు ఈ నెంబర్ కు ఫోన్ చేసినా అదే పని చేస్తారా అని గుసగుసలాడుకున్నారు సభలో ఉన్న ప్రజలు. రాబోయే ఎన్నికల్లో 25 ఎమ్.పి సీట్లు గెలిపిస్తే విభజన చట్టం హామీలు రాబడతానన్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఆ మాట నమ్మే ఓట్లేసిన ప్రజలకు, ఎన్డీయేతో కలిసి నెత్తిన చెయ్యెట్టి, మళ్లీ అదే పాట పాడి ఓట్లు అడగడం బాబుకే చెల్లిందనుకున్నారు వేదిక ముందున్న జనం. 

ఇక గ్రామ సభలోనూ బాబు సంధి ప్రేలాపనలు కొనసాగాయి. సొంత పార్టీ నేతలు, తమ తెలుగు తమ్ముళ్ల అవినీతి గురించి బహిరంగంగానే బాబుగారు ఒప్పుకోవాల్సి వచ్చింది. టిడిపి తెలుగు తమ్ముళ్లు కమీషన్లు తీసుకోకుండా ఫించన్లు ఇస్తున్నారా అని అడిగిన బాబుకు పట్టుపని పది నోళ్లు కూడా అవునని చెప్పలేదు. తమ్ముళ్ల అవినీతికి అసలు తల్లివేరు తానే అన్న విషయాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోతారని చంద్రబాబు పదే పదే భ్రమపడటమే విడ్డూరం. 

మొత్తానికి బాబు పర్యటన ప్రసంగంలో  తన తప్పులేవీ లేవని, అన్నీ అధికారులు, అవినీతి చేసే తెలుగు తమ్ముళ్లవే అని రుజువు చేసుకునేందుకు పడే తాపత్రయం కన్పిస్తుంది. దాన్ని నమ్మి మళ్లీ ఎన్నికల్లో ప్రజలు తనకే అధికారం కట్టబెడతారనే అత్యాశ కన్పిస్తుంది. గతంలోనూ తొమ్మిదేళ్ల పాలన తర్వాత అధికారాన్ని కోల్పోయే ముందు రోజుల్లో బాబు సంధి ప్రేలాపన ఇలాగే ఉండేది. రైతుల ఆత్మహత్యలు, ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడటం, అధికారులను జన్మభూమి కార్యక్రమాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టడం, తన అవినీతి విశ్వరూపాన్ని నిస్సిగ్గుగా బాహాటం చేయడంలాంటి లక్షణాలన్నీ మళ్లీ ఈ ఎన్నికల వేళ బాబులో కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com