Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ రోజు గురువారం ఉదయం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం డి. ఎర్రవరం నుంచి ప్రారంభం                               రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                 
    Show Latest News
గల్ఫ్ లోని తెలుగువారి కష్టాలు పట్టని చంద్రబాబు

Published on : 14-Feb-2018 | 14:54
 


అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా సార్లు గల్ఫ్ దేశాల పర్యటనలు చేసారు. అందులో ఎక్కువ సార్లు వెళ్లింది దుబాయ్ కి. ఎప్పుడూ పెట్టుబడుల కోసం ఎడారుల వెంట పరుగులు తీసానని చెప్పుకోవడమే కానీ ఆ ఎడారి దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న తెలుగువారి గురించి పట్టించుకోవాలని ఒక్కసారీ ఆలోచించలేదు. ప్రపంచమంతా తెలుగు మేధావులు పని చేస్తున్నారని, వారందరినీ తానే పంపించానని అతిశయాలు చెప్పుకునే ఎపి సిఎమ్ గల్ఫ్ దేశాల్లో అన్యాయంగా మగ్గిపోతున్న తెలుగు శ్రామికుల వ్యధను వినడానికి కూడా ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. దుబాయ్, అబుదాబీల్లో పర్యటించి ఆదేశ ప్రముఖులతో భేటీ అయ్యి, పర్యాటక ప్రాంతాలు చుట్టి రావడమే తప్ప అక్కడి తెలుగువారి గురించి చంద్రబాబు వాకబుకూడా చేయలేదు. పక్కనే ఉన్న కువైట్ లో వేలాదిమంది తెలుగు వాళ్లు ఏజెంట్ల చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితుల్లో నరక యాతన అనుభవిస్తున్నారు. పొట్టకూటి కోసం సౌదీ వెళ్లి సాలెగూటిలో చిక్కుకుపోతున్న ఎందరో దీనుల గాధలను పత్రికలు, ఛానెళ్లూ ప్రసారం చేస్తూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు వారిని ఆదుకోమని ప్రభుత్వానికి వినతులు చేస్తూనే ఉన్నాయి. మా వాళ్లను కాపాడండంటూ వారి కుటుంబాలు ముఖ్యమంత్రిని మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. కానీ బాబుకు వారి గోడు పట్టదు. ఎప్పుడూ సంపన్న దేశాల చుట్టూ చక్కర్లు కొట్టిరావడమే బాబు వ్యాపకం. 

ఎడారి దేశం నుంచి తెలుగునేలకు చేరుతున్న బాధితులు

కరువు కాటకాలతో అల్లాడుతూ, ఉపాధి దారి లేక దేశం విడిచి ఎడారి దేశాల బాట పట్టారు ఎందరో తెలుగువాళ్లు. వారిలో చదువురాని వారే ఎక్కువ. ఇంటిపనులు, ఫ్యాక్టరీ పనులు, దుకాణాల్లో పనిచేయడం వంటి ఎన్నో పనుల కోసం ఇక్కడ నుండి వలస పోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా ఈ వలసలు సాగుతుంటాయి. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న మధ్యవర్తులు తప్పుడు ధృవ పత్రాలతో వారిని కువైట్ వంటి దేశాలకు పంపి తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ఉద్యోగాలు పోయి, యజమానుల చేతుల్లో హింసలకు గురయ్యి ఎందరో శ్రామికులు నిలువనీడ లేకుండా పోతున్నారు. అరబ్ దేశాల్లో కఠిన చట్టాల కారణంగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమని ఏదో మూల తలదాచుకుంటున్నారు. ఎలాగైనా మమ్మల్ని కాపాడండంటూ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్న సంఘటనలు అనేకం. కానీ ఏళ్ల తరబడి ఎదురుచూసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎంబసీ ద్వారా వారిని రక్షించి స్వస్థలాలకు తీసుకువచ్చే ప్రయత్నమేదీ చేయలేదు చంద్రబాబు సర్కార్. 

అక్కడి ప్రభుత్వమే పూనుకున్నా రాష్ట్రంప్రభుత్వం నుంచి స్పందన సున్నా

కువైట్ ప్రభుత్వం పూనుకుని నివాసం లేనివాళ్లు అమ్మెస్టీ ద్వారా తమ ప్రాంతాలకు వెళ్లిపోయే అవకాశాన్ని కల్పించింది. చివరకు అక్కడ ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వారిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాయి. సుమారు 9000 మంది తెలుగు వారు అనధికారికంగా కువైట్ లో నివసిస్తూ స్వదేశానికి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. వీరంతా ఏజెంట్ల వల్ల మోసపోయినవారే. ఇండియన్ ఎంబసీ వద్ద అవుట్ పాస్ కోసం బారులు తీరిన వీరిలో చాలా మంది తిరుగు టికెట్టు కొనుక్కునే స్థోమత కూడా లేనివారు. కనీసం ఇప్పుడైనా పాలకులు స్పందించి వారికి రవాణా ఛార్జీలు అందించడమో, వారి ఉపాధి కోసం తోడ్పాడు అందిస్తామనే ప్రకటనతో వారికి ఊరట కలిగించడమో చేయడం లేదు. పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ అంశం కేవలం ఓ మచ్చుతునక మాత్రమే. 

బాధితులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్లు, కువైట్ కన్వీనర్లు బాధితులకు అండగా నిలిచారు. బాధితులు తిరగి రావడానికి ప్రభుత్వం తరఫున సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసారు. కువైట్ విమాన యాన సంస్థ సైతం తెలుగువారికి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. పౌర సమాజం, ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు గల్ఫ్ బాధితులకు చేతనైనంత సాయం అందిస్తుంటే, బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పార్టమెంటులో నాటకాలు ఆడుతూ కాలం గడుపుతోంది. 
ప్రవాసాంధ్రుల సంక్షేమానికి పాటుపడతామంటూ చంద్రబాబు చేసే ప్రకటనలు పెదవి వరకే పరిమితమని గల్ఫ్ బాధితులు వాపోతున్నారు. సంపన్నదేశాల్లో ఆర్థికంగా ఎదిగిన తెలుగువారిని మాత్రమే చంద్రబాబు వెళ్లి మరీ కలుస్తాడని, లోకేష్ కూడా ఇటీవల అమెరికా పర్యటనల్లో అలాగే చేసాడని వారు గుర్తు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న తెలుగు వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి పార్టీ కోసం, ఫండ్ కోసం తప్ప మరి దేనికీ ప్రవాసాంధ్రులను కలవరని వారు ఆవేదన వ్యక్తం చేసారు. బాబు స్వార్థ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకునే మరో సంఘటన ఇది. 
 
Labels : YSRCP, YS Jagan, NCBN, Gulf,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com