Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాజధాని బాధిత రైతులకు మేం అండగా ఉంటాంః వైయస్ జగన్                               ప్రభుత్వమే భూములు లాక్కుంటే తాము ఎక్కడకు పోవాలి, ఎలా బతకాలని రైతుల మనోవేధన                               చంద్రబాబును నమ్మి మోసపోయామని బాధిత రైతుల ఆవేదన                               అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు..పేదల కడుపు కొడితే సహించేది లేదుః వైయస్ జగన్                               రూ.15కోట్ల విలువ చేసే భూమికి..రూ.30 లక్షలు మాత్రమే ఇస్తామనడం బాధాకరంః వైయస్ జగన్                               300కుటుంబాలను నేలమట్టం చేసి, 25ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణంః వైయస్ జగన్                               కనకదుర్గ వారధి వద్ద సీడ్ క్యాపిటల్ యాక్సెస్ హైవే బాధిత రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి                               గన్నవరం విమానాశ్రయంలో వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు                               రాజధాని ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటన                 
    Show Latest News
వైయస్ఆర్ కల సాకారం

Published on : 11-Jan-2017 | 17:38
Share    

వైయస్ఆర్ కడప : పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంతో దివంతగ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కల సాకారం అయిందని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.  పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పైడిపాలెం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలలో కరెంటు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల ద్వారా వారి కరెంటు బిల్లులు చెల్లించి, ఆయా కాలనీలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరారు. 2012–2013వ సంవత్సరంలో దెబ్బతిన్న శనగ పంటకు ఇంతవరకు పరిహారం అందలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సభలో మహానేత పేరు వినపడగానే పెద్ద ఎత్తున హర్షధ్యానాలు వినిపించాయి. వైయస్ఆర్ కృషి వల్లే పైడిపాలెం రిజర్వాయర్ కు నీళ్లు వచ్చాయని, జోహార్ వైయస్ఆర్ అని అవినాష్ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com