Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                 
    Show Latest News
పోలవరం ప్రాజెక్టులో విచ్చలవిడి అవినీతి

Published on : 12-Sep-2018 | 15:55
 

ఎన్నికల సొమ్మును పోలవరంలో పిండేస్తున్నారు..
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయిక
వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు
విశాఖః పోలవర ప్రాజెక్టు చంద్రబాబుకు కల్పవృక్షంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును  తమ రాజకీయ అవసరాలు కోసం వాడుకుంటూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇష్టారాజ్యంగా  కాంట్రాక్టర్లను మారుస్తూ వారి నుంచి ముడుపులు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ పోలవరం పనుల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అవినీతిని కప్పిపుచ్చడానికి అద్భుతం జరిగిపోతున్నట్లు  ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నారన్నారు.  గ్యాలరీ వాక్‌లు పేరుతో ఆయన కుటుంబసభ్యులను, కార్యకర్తలను రాష్ట్ర నలుమూలల నుంచి తీర్థయాత్రలా బస్సులు పెట్టి తరలించి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నారన్నారు. కేంద్రపభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకుని నిధులను స్వాహాచేస్తున్నారన్నారు.  ఎన్నికలకు కావాల్సిన సొమ్మునంతా ప్రాజెక్టులో పిండేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం నిర్మాణం పూర్తియితే తప్ప ఎన్నికల్లో ఓట్లు అడగనని చంద్రబాబు చెప్పారని, . నేడు గ్యాలరి మీద ఆయన మనవడిని నడిపించి ఓట్లు అడుగుతున్నారన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడం కోసం కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నారన్నారు. చిత్తశుద్ధితో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కుటుంబసభ్యులతో నడిపించి షోలు  చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయికః
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయిక అని అంబటి అన్నారు. పొత్తులు పెట్టుకోవడం తప్పకాదని, పొతుల్లో నెత్తిక విలువలు ఉండాలన్నారు.కాంగ్రెస్‌తో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ కలుస్తుందని ఎప్పడైనా ఊహించారా అంటూ టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించారు. ఎవరితోనైనా కలుస్తారని ఉపయోగించుకున్న తర్వాత ఎవరినైనా వదిలేయడం  చంద్రబాబు సిద్ధాంతం అని విమర్శించారు.ు  రాజకీయ  ఊసరవెల్లి చంద్రబాబు అని తెలుగు ప్రజలు గమనించాలని,  ఇటువంటి రాజకీయ నాయకుడిని చ్రరితలో తిరస్కరించాలన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com