Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                 
    Show Latest News
నేటి సాయంత్రం వైయస్ఆర్ సీపీ కీలక సమావేశం

Published on : 12-Feb-2018 | 13:33
 

నెల్లూరు: రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయడానికి, వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులతో  సోమవారం సాయంత్రం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్  జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొంటున్నారు.  నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్ద కొండూరులో ప్రజా సంకల్ప పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరగనుంది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, జరిగిన అన్యాయం, రాష్ట్ర ప్రయోజనాలను గత నాలుగేళ్ళుగా తాకట్టు పెడుతూ..  టీడీపీ భాగస్వామిగా ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరి ఏడాది, ఐదవ బడ్జెట్‌ ప్రవేశపెట్టాక – తెలుగుదేశం పార్టీ కొద్దిరోజులుగా పార్లమెంటు వేదికగా ఆడుతున్న డ్రామాలు, రాష్ట్రానికి ఏదో సాధించినట్టు చేస్తున్న హడావుడి, సంబరాలు చేసుకోడాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యహంపై చర్చించనున్నారు. అట్లాగే  ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవని అంటూ గత నాలుగేళ్ళుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు అవసరమైన కార్యాచరణ  రూపొందించటం.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com