Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
వైయస్సార్‌సీపీ శ్రేణుల సమరోత్సాహం

Published on : 15-Jul-2017 | 18:44
 

నరసరావుపేటః గతంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదుచేసి అరెస్టుచేసే యత్నంలో పోలీసులను అడ్డుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు పోలీసు సీఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన నీలం చంద్రశేఖర్‌ వ్యవహారంలో మరోసారి తమ బలాన్ని ప్రదర్శించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహనరెడ్డి ఆదేశాలమేరకు చంద్రశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు అగ్రనేతలు మాజీమంత్రి, జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వినుకొండ, తాటికొండ, పెదకూరపాడు సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, హెన్రీ క్రిస్టీనా, కావటి మనోహరనాయుడు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళఅప్పిరెడ్డి, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు డైమండ్‌ వజ్రబాబు, మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ సయ్యద్‌మాబు శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే వీరికి స్వాగతం పలికేందుకు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు వేచి ఉన్నారు. అక్కడి నుంచి బరంపేటలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌ గృహానికి ద్విచక్రవాహనాలపై బ్రహ్మాండమైన ర్యాలీతో బయలుదేరి వెళ్ళారు.
మిట్టపల్లి గృహంలో చిరు సత్కారం
బాధిత కుటుంబాన్ని పరామర్సించేందుకు వచ్చిన అగ్రనేతలకు పార్టీ రాష్ట్ర కార్యదర్సి మిట్టపల్లి రమేష్‌ తన గృహంలో చిరు సత్కారం చేశారు. రమేష్‌ నేతలకు పూలదండలు వేసి శాలువను కప్పి జ్ఞాపికలను అందజేశారు. తమ గృహాన్ని సందర్శించినందుకు వారందరికీ కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లాంసోమయ్య, మాడిశెట్టి మోహనరావు, షేక్‌.రెహమాన్, కారుమంచి మీరావలి, మాగులూరి రమణారెడ్డి, వైయస్సార్‌సీపీ నాయకులు జెడ్పీటీసీ నూరుల్‌ అక్తాబ్, మాజీ జెడ్పీటీసీ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మారూరి రామలింగారెడ్డి, జిల్లా కార్యదర్శులు ఎస్‌.సుజాతాపాల్, షేక్‌.ఖాదర్‌భాషా, కందుల ఎజ్రా, జిల్లా సంయుక్త కార్యదర్శి మండా లక్ష్మణరావు, విద్యార్ధి విభాగ రాష్ట్ర కార్యదర్శి గోగుల మనోహరయాదవ్, న్యాయవాది దేశిరెడ్డి మల్లారెడ్డి, ముఖ్యనేత మద్దిరెడ్డి నరసింహారెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ఖాదర్‌భాషా, మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, యువజన విభాగ నాయకులు రామిశెట్టి కొండ, ఎన్‌.కె.ఆంజనేయులు, వరవకట్ట బుజ్జి, భాస్కరరెడ్డి, పి.ఆకాష్, వక్కలగడ్డ సురేష్, రాంబాబు, కంచర్ల హనుమంతరావు, వ్యాపారులు కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గాందశెట్టి రామకృష్ణ, బంగారు, వెండి వర్తకుల అసోసియేషన్‌ కోశాధికారి దేసు రజనీకుమార్, పట్టణ స్టీలు షాపుల అసోసియేషన్‌ అద్యక్షుడు కొత్తూరి కిషోర్, వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్త పెద్దన్న, శ్రీనివాసరావు, ఆవుల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com