Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
వైయస్‌ఆర్‌సీపీ నేతల గృహ నిర్బంధం

Published on : 10-Oct-2018 | 11:43
 

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది..
వైయస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి.
అనంతపురంః చంద్రబాబునాయుడు ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళిన టీడీపీ ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీ నేతలను నిర్భందించడం అలవాటుగా మారిపోయింది.రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని చెప్పడానికి టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అనంతపురంలో జిల్లాలో నేడు సిఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలను ముందుస్తుగా అరెస్ట్‌ చేశారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కల్యాణదుర్గంలో సంయుక్త కార్యదర్శి కిష్టప్పసహా 10 మందిరి అరెస్ట్‌ చేయగా, అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలకు పోలీసుల నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా  రాయదుర్గంలో ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి శాంతియుతంగా తీసుకెళ్లాడానికి సిద్ధపడితే టీడీపీ ప్రభుత్వం నిర్బంధచర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నుంచి పోలీసులను మోహరించి వైయస్‌ఆర్‌సీపీ నేతలను యుద్ధఖైదీలా గృహ నిర్బంధన చేసి భయభ్రాంతులను గురిచేస్తున్నారన్నారు. అణచివేత ధోరణి ప్రభుత్వంలో కనబడుతుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను టీడీపీ కాలరాస్తుందని మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో  పోలీసులను అడ్డంపెట్టుకుని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారని మండిపడ్డారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com