Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  
    Show Latest News
వైయస్‌ జగన్‌ ప్రకటనతో బాబు గుండెల్లో రైళ్లు
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌

Published on : 14-Feb-2018 | 16:40
 
– సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌
–  బాబుకు..వైయస్‌ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
– బాబు జీవితమంతా వెన్నుపోటు, దగా
– దమ్ముంటే వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించాలి
– వైయస్‌ జగన్‌ను విమర్శించడానికే టీడీపీ సమన్వయకమిటీ
విజయవాడ: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు   విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ 12 రోజులుగా టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. చంద్రబాబు బడ్జెట్‌పై ఊగిపోతున్నారని మీడియాకు లీకులు ఇచ్చారని విమర్శించారు. ఢిల్లీలో కొందరు ఎంపీలు గుండు గీయించుకొని ఆరు కోట్ల తెలుగు ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. అచ్చెన్నాయుడికి ఒళ్లు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని మేం మోసం చేయలేదని, ఒక మాట కోసం, విలువల కోసం, విశ్వసనీతయ కోసం పదవులను త్రుణప్రాయంగా వదిలి బయటకు వచ్చిన ధీరుడు, ధీశాలి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలు, డ్రామా రాజకీయాలపై, మాకున్న విలువలు, విశ్వసనీయతలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఏడాది పాటు అవకాశం ఉన్నా ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారని, మీకు విలువలు ఉంటే స్వాగతించాలని, విమర్శించడం తగదన్నారు. మీ గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా కావాలంటే వైయస్‌ జగన్‌తో కలిసి పోరాటం చేయాలని కోరారు.
 
బాబు ఎక్కడా:  వెల్లంపల్లి శ్రీనివాస్‌
చీమ చిటుక్కుమంటే గంటలు గంటలు మీడియాతో మాట్లాడే చంద్రబాబు రెండు వారాలుగా బడ్జెట్‌పై మాట్లాడే దమ్ము, ధైర్యం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దుబాయి నుంచి రాగానే గంట ప్రెస్‌మీట్‌ పెట్టే వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేవలం మీడియాకు లీకులు ఇస్తూ ఎందుకు నేరుగా మీడియాతోమాట్లాడటం లేదని నిలదీశారు. వైయస్‌జగన్‌ పబ్లిక్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు అజ్ఞాతంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం ఎందుకని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా ఎంపీలు ఏప్రిల్‌ 6న రాజీనామా చేస్తారని వైయస్‌ జగన్‌ ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా ఇంకా కేంద్రంతో కలిసి పని చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వైయస్‌ జగన్‌ పెట్టిన డెడ్‌లైన్‌కు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
 
టీడీపీలో కలవరం: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో టీడీపీలో కలవరం మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. వైయస్‌ జగన్‌ ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకటించారన్నారు. ఇవాళ టీడీపీకి చెందిన ముగ్గురు మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జనాలు రావడం లేదా? డ్రామాలు ఆడుతున్నామా? వైయస్‌ జగన్‌ ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఇంకా 15 నెలల ఎన్నికలకు సమయం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేసే రాజీనామాల అంశాన్ని నీరుగార్చేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించాలని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. కేంద్రంతో పోరాడే తత్వం వైయస్‌ జగన్‌కు ఇది కొత్త కాదన్నారు. ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ ప్రకటనలు ఉన్నాయన్నారు. చంద్రబాబు 26 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి..ఇవాళ ఏమీ చేయలేక నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com