Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కొయ్యాన‌పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్‌ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 295వ రోజు సాలూరు నియోజకవర్గం, పాయకపాడు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                                వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉంది.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది                               కత్తి మెడపై తగిలి ఉంటే వైయ‌స్‌ జగన్‌ ప్రాణాలే పోయి ఉండేవి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది ఆందోళన                  
    Show Latest News
వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయం
– మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Published on : 12-Jul-2018 | 17:15
 



ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు పట్టణంలో ఇంటింటికి వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా వైయస్‌ఆర్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రానున్నది రాజన్న రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యాన్‌ గాలికి ఎదురు నిలువలేరన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  కేంద్ర మంత్రి గడ్కారి అడిగిన లెక్కలు టీడీపీ చెప్పడం లేదన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేని అసమర్ధుడు బాబు అని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై విచారణ చేపడుతామని హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com