Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
ఏజెన్సీలో ఉత్సహంగా వైయస్సార్‌ కుటుంబం

Published on : 21-Sep-2017 | 17:25
 

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో ఎతైన కొండలపై ఉన్న గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమం చేపట్టారు. స్వయంగా బూత్‌కమిటీ సభ్యులే ఇంటింటికి వెళ్లి తన దైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా సభ్యులను చేర్చుకుంటున్నారు. గురువారం బూత్‌ కమిటీ సభ్యులు ఎం.ఫల్గుణరావు, బి.గంగారావు, ఎ.అప్పన్న, ఎస్‌.దర్శన్న ఆధ్వర్యంలో బెన్నరాయి, పాండ్ర, లోవగూడ, ఇస్పరాయి, మేడ వొబ్బంగి,బాపన్నగూడ, కొండాడ, లాడ, అంటిమానుగూడ, జాతాపులాడ తదితర గ్రామాల్లో కుటుంబ కార్యక్రమం నిర్వహించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గూర్చి వివరించారు. 

నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం
పోలాకి: మండలంలోని పలు బూత్‌కమిటీల పరిధిలో స్ధానిక వైయస్‌ఆర్‌సీపీ కమిటీ సభ్యులు, నాయకుల సమక్షంలో నవరత్నాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వనితమండలం పంచాయితీ పరిధిలోని జొన్నాం గ్రామంలో స్ధానిక నాయకుడు ఎన్ని వెంకటేష్‌ ఆధ్వర్యంలో నవరత్నాలపై ప్రచారం చేశారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగంగా సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టారు.

జగనన్నతోనే మళ్లీ రాజన్నపాలన 
పార్వతీపురంటౌన్‌: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే మళ్లీ రాజన్నరాజ్యం వస్తుందని వైయస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ అన్నారు. గురువారం పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డుల్లో గడప గడపకీ వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ గడపకు వెళ్లి వారితో మాట్లాడి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలగూర్చి వివరించారు. జగన్‌మోహన్‌ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే రత్నాలలాంటి 9పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తారని తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్న నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. ఈసందర్భంగా వైయస్సార్‌ సీపీ నాయకులు అలజంగి జోగారావు మాట్లాడుతూ... తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వస్తున్నారని, వారిని ప్రతీ ఒక్కరు నిలదీయాలన్నారు. బాబు వస్తే జాబ్‌ వస్తాదన్నారు. నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు. మా ఇంటి మా లక్ష్మి అన్నారు. రుణమాఫీ అన్నారు. ఇలా 600 అబద్ధపు హామీలు ఇచ్చిన బాబు పాలనను ప్రతీ ఒక్కరు ప్రశ్నించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ కుటుంబానికి ఒక వైయస్సార్‌ చిత్రాన్ని అంటించి అనంతరం కుటుంబ సభ్యులచేత ఫోన్‌చేయించి జగన్‌మోహన్‌రెడ్డి వాయిస్‌కాల్‌తో మాట్లాడి వారిని వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ కుటుంబం పరిశీలకులు కొండపల్లి బాలకృష యాళ్ల ప్రతాప్, చుక్క లక్ష్ముంనాయుడు, సీనియర్‌ కౌన్సిలర్‌ గొల్లు వెంకట్రావు, ఎస్‌. శ్రీనివాసరావు, చీకటి అనూరాధ, బోను గౌరీశ్వరీదేవి, బోను ఆదినారాయణ, ఏగిరెడ్డి భాస్కరరావు, గొట్టా శివకేశ్వరరావు, బుగత రాజు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు
ఆమదాలవలస రూరల్‌: నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వైయస్సార్‌ సీపీ సర్పంచ్‌ ప్రతినిధి చిగురుపల్లి దశరధ అన్నారు. మండలంలో దూసి పంచాయతీలో గల నెల్లిమెట్ట గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరిగే పథకాలు గురించి వివరించారు. జగన్నన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదోడికి భరోసా లభిస్తుందని అన్నారు. గ్రామంలో ముమ్మరంగా వైయస్సార్‌ సీపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బూత్‌స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మెంటాడ మండలంలో ఇంటింటా వైయస్సార్‌ కుటుంబం
మెంటాడ:మండలంలోని కుంటినవలస, గుర్ల గ్రామాలలో గురువారం ఇంటింటా వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపగడపకు వెళ్లి వైయస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు వివరించారు. మంచి స్పందన లభించింది. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికి సంక్షేమ పథకాలు అందుతాయని వారు వివరించారు. అలాగే సభ్యత్వాలు నమోదు చేయించారు. కార్యక్రమంలో కుంటినవలస సర్పంచ్‌ యర్రా సింహాచలం, గ్రామ కన్వీనర్‌ యాడ్రాపు సింహాచలం, మాజీ ఎంపీటీసీ రావాడ సూర్యారావు, పొరిపిరెడ్ది సూర్యారావు, పుర్నాన అప్పలనాయుడు, పుర్నా రాజు, జి. సతీష్, వైయస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com