Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             షెడ్యూల్ ప్రకారం వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందిః వాసిరెడ్డి పద్మ                               వైయస్ జగన్ ను జనం నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదుః వాసిరెడ్డి పద్మ                               వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో వైయస్ జగన్ భేటీ                               ఈనెల 26న వైయస్ఆర్ సీఎల్పీ సమావేశం                               వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి                               పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలిః వైవీ సుబ్బారెడ్డి                               తెలుగు ప్రజలందరికీ వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు                               ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారుః వైయస్ జగన్                               ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలిః వైయస్ జగన్                 
    Show Latest News
వైయస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్ : ‌పులివెందులలో ఉద్రిక్తత

Published on : 31-Aug-2012 | 02:12
 

పులివెందుల (వైయస్‌ఆర్‌ కడప జిల్లా), 31 ఆగస్టు 2012 : విద్యుత్ కోతలకు నిరసనగా శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరె‌స్టులు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బం‌ద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం కన్వీనర్ వైయస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, పోలీసుస్టేషన్‌కు తరలించారు. అవినాష్‌రెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.బంద్‌లో పాల్గొన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఈడ్చుకెళ్ళి, పోలీసు వాహనాల్లో పడేశారు. పులివెందులలో అదనపు బలగాలు మోహరించి, భయోత్పాతం సృష్టించారు. పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఈసందర్భంగా డీఎస్పీని ప్రశ్నించారు.

కాగా, అవినాష్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీనితో పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పులివెందులలో ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం ముందస్తుగా పక్కా వ్యూహం పన్నినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, నిర్బంధిస్తున్నారని పార్టీ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com