Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                               పి.గ‌న్న‌వ‌రం నుంచి 193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు: జోగి ర‌మేష్‌                               లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
జ‌న‌నేత‌కు జేజేలు

Published on : 25-Nov-2017 | 14:17
 


- యువ‌త‌లో ఉప్పొంగిన ఉత్సాహం
- స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటూ..భ‌రోసా క‌ల్పిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 
- జ‌న‌సంద్ర‌మైన చెరుకుల‌పాడు 

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. జ‌న‌నేత రాక‌తో ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. రాజ‌న్న బిడ్డ వ‌చ్చాడ‌ని జ‌నం సంబ‌ర‌ప‌డుతున్నారు. యువ‌త ఆనందానికి అవ‌ధులు లేకుండా పో్యాయి. గ్రామాల్లో జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ త‌న 17వ రోజు పాద‌యాత్ర‌ను క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో శ‌నివారం నిర్వ‌హించారు. వెల్దుర్తి నుంచి ప్రారంభమైన పాద‌యాత్ర చెరుకుల‌పాడు గ్రామానికి చేరుకోవ‌డంతో ఒక్క‌సారిగా జ‌నం అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  అన్న వస్తున్నాడు అంటూ వైయ‌స్‌ జగన్‌కు ప్ర‌జ‌లు జేజేలు పలికారు. అశేష ప్రజాభిమానం నడుమ చెరుకుల‌పాడు గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే ఎద్దుల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టిన రాజ‌న్న బిడ్డ‌ను చూసి ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేయగా, యువత ఉత్సాహంతో ఈలలు వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. 

స‌మ‌స్య‌ల వెల్లువ‌
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌గా రావ‌డంతో స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు.  నాలుగేళ్ల  టీడీపీ పాలనలో తాము పడుతున్న ఇబ్బందుల‌ను వైయ‌స్‌ జగన్‌కు  వివరించారు. వెల్దుర్తిలో  వైయ‌స్‌ జగన్‌ను... కలిసిన మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ సహకారం, బ్యాంకు రుణాలు గురించి మహిళలను వైయ‌స్‌ జగన్ అడిగి తెలుసుకున్నారు. రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా లేదా అని అడిగారు.  దీనికి రుణాలు అందలేదని..బంగారం బ్యాంకులోనే ఉందని ముక్తకంఠంతో చెప్పారు. చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సున్నా, పావలా వడ్డీలు ...రావడం లేదని వివరించారు. తమను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని మైనార్టీ సోదరులు ప్రతిపక్షనేతకు విన్నవించుకున్నారు. రిజర్వేషన్తొ పాటు మసీదుల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాల విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు. విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.పాదయాత్రలో భాగంగా కృష్ణాగిరి మండలం వైయ‌స్‌ జగన్‌ను ....జైపాల్‌ రెడ్డి అనే దివ్యాంగుడు కలిశాడు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3000కి పెంచాలని కోరారు. దాంతో పాటు రేషన్‌ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని 35 కేజీలకు పెంచాలని కోరాడు. వీరి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వైయ‌స్ జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. అనంత‌రం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైయ‌స్‌ జగన్‌ సందర్శించి, నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com