Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ ఏడాది

Published on : 05-Nov-2018 | 18:31
 - ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పాద‌యాత్ర‌
- 12 జిల్లాల్లో జ‌న‌నేత పాద‌యాత్ర‌
- అడుగ‌డుగునా స‌మ‌స్య‌ల స్వాగ‌తం
- అండ‌గా ఉంటాన‌ని జ‌న‌నేత భ‌రోసా

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తి అయ్యింది. గ‌తేడాది నవంబ‌ర్ 6వ తేదీ వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు 12 జిల్లాల్లో కొన‌సాగింది. ఏడాది కాలం పాటు జ‌న‌నేత  క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు రాళ్లూ, రప్పలు లెక్క చేయకుండా కాలికి బలపం కట్టుకుని తిరిగారు.  మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి పింఛన్ కోసం పడిగాపులు కాచిన ముసలయ్య కాళ్లకు ఈ కష్టం తెలుసు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక  ట్యాంకర్ల దగ్గర బిందెలు మోసే చెల్లెమ్మలకు తెలుసు నీ పాదాలు మోసే బరువెంతో. ఒక్క సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే కుర్రోళ్లకు తెలుసు కాళ్లరిగిపోవడం అంటే ఏమిటో? లక్షల ఫీజులు కట్టలేక ప్రైవేటు బళ్లలో బెంచెక్కి నిలబడే పిల్లగాళ్లకు తెలుసు ఆ కాళ్లకెంత కష్టమో? అందుకే జ‌గ‌న‌న్న వెళ్లిన ప్ర‌తి చోటా  పూలు వ‌ర్షం కురిపించారు. క‌ష్టాలు తెలుసుకునేందుకు, క‌న్నీళ్లు తుడిచేందుకు ఊరూరు వ‌చ్చి పలకరించాడు. గుండె గుండెనూ తాకి ధైర్యమిచ్చాడు. ఏడాది కాలంలో ఎంతో మంది క‌ష్టాలు తెలుసుకున్న జ‌గ‌న‌న్న రాజ‌న్న రాజ్యంలో వారి ముఖాల్లో చిరున‌వ్వులు చూడాల‌న్న‌దే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను ఊరూరా వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లోని ముఖ్య ఘ‌ట్టాలు ఇలా ..

జిల్లాల వారిగా పాదయాత్ర వివరాలు
–  వైయస్‌ఆర్‌ జిల్లాలో 7 రోజుల పాటు 5 నియోజకవర్గాల్లో 93.8 కిలోమీటర్ల పాదయాత్ర
– కర్నూలు జిల్లాలో 18 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో 263 కిలోమీటర్లు
– అనంతపురం జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో 279.4 కిలోమీటర్లు
– చిత్తూరు జిల్లాలో 23 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో 291.4 కిలోమీటర్లు
– నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో 266.5 కిలోమీటర్లు
– ప్రకాశం జిల్లాలో 21 రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో 278.1 కిలోమీటర్లు
– గుంటూరు జిల్లాలో 26 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో 281 కిలోమీటర్లు
– కృష్ణా జిల్లాలో 24 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో 239 కిలోమీటర్లు
– పశ్చిమ గోదావరి జిల్లాలో 27 రోజుల పాటు 13 నియోజకవర్గాల్లో 316.9 కిలోమీటర్లు
– తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో 412 కిలోమీటర్లు
– విశాఖ జిల్లాలో 32 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో 277.1 కిలోమీటర్లు
– విజయనగరం జిల్లాలో ఇప్పటికి 26 రోజులు 7 నియోజకవరగాల్లో 213.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు.
 
కిలోమీటర్ల వారీగా పాదయాత్రలో ఘట్టాలు
3200 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా  సాలూరు నియోజకవర్గం, సాలూరు మండలం బాగు వ‌ల‌స‌( అక్టోబ‌ర్ 24, 2018)
3100 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ (అక్టోబ‌ర్,8,2018)
3000 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌. కోట నియోజ‌క‌వ‌ర్గంలోని దేశ‌పాత్రునిపాలెం(సెప్టెంబ‌ర్‌24, 2018) 
2900 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా స‌బ్బ‌వ‌రం (సెప్టెంబ‌ర్ 5, 2018)
2800 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా యలమంచిలి (ఆగ‌స్టు 24, 2018)
2700 కిలోమీట‌ర్లు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగ‌స్టు11, 2018)
2600 కిలోమీట‌ర్లు తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌( జులై 8, 2018)
2500 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2400 కిలోమీట‌ర్లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం క్రాస్ వ‌ద్ద (జూన్ 21, 2018)
2300 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు ‍క్రాస్‌ రోడ్డు వద్ద  2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ 24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైయ‌స్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com