Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                                డిసెంబర్‌ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర                                పిల్లలను ధైర్యంగా బడికి పంపండి -వైయ‌స్ జ‌గ‌న్                               నాలుగు విడతులుగా రుణాలన్నీ మాఫీ చేస్తా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                                దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                                నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                 
    Show Latest News
ఏడాది ఓపిక పట్టండి

Published on : 15-Nov-2017 | 13:21
 


-  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా
- ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మీయ స్వాగ‌తం
కర్నూలు: చ‌ంద్ర‌బాబు హ‌మీల‌తో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఏడాది ఓపిక ప‌ట్టండి మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అంద‌రికి న్యాయం జ‌రుగుతుంద‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌.జా సంక‌ల్ప యాత్ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. రాజ‌న్న బిడ్డ‌కు ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. బుధ‌వారం ఉద‌యం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి  వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర మొదలుపెట్టగానే వృద్ధులు, మహిళలు.. ఆయ‌న్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ జ‌న‌నేత ఆప్యాయంగా పలకరిస్తూ ...ఏడాది ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుందని.....అందరి కష్టాలు తీరుతాయని భరోసా కల్పిస్తున్నారు. వ‌క్కిలేరు వాగు వ‌ద్ద జ‌నం ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  పెద్దకోట కందుకూరు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు గ్రామస్తులు పూల‌వ‌ర్షం కురిపించారు. రహదారులన్నీ బురదమయం అయినా, అదే రోడ్లపై వెళ్లి ఆయన స్థానికుల్ని పలకరించారు. అంతేకాకుండా వయోభారంతో తన వద్దకు రాలేని వారిని ...అక్కడకు వెళ్లి మరీ పలకరించారు. టార్పాలిన్‌నే పైకప్పుగా చేసుకున్న నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అలాగే వృద్ధులకైతే పింఛన్‌, రేషన్‌పై హామీ ఇస్తున్నారు. తనను కలిసిన మహిళలకు ....అమ్మ ఒడి పథకంతో చిన్నారులను చదివించే బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా రాబోయే రాజన్నరాజ్యం ఉంటుందని ప్రతిఒక్కరికీ చెబుతూ జ‌న‌నేత‌ ముందుకు సాగుతున్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com