Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
నేనున్నా.. భ‌యం వ‌ద్దు
అయేషా త‌ల్లిదండ్రుల‌కు జ‌గ‌న్ భ‌రోసా

Published on : 12-Feb-2018 | 13:42
 

* డ‌యాల‌సిస్ చేయిస్తాన‌ని హామీ
* మ‌న ప్ర‌భుత్వం రాగానే ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ‌వైభ‌వం తెస్తాం




నెల్లూరు: ప‌్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయేషా లాగా డ‌యాల‌సిస్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన స‌లీం, ముంతాజ్‌బేగం దంప‌తులు త‌మ కూతురిని ఆదుకోవాల‌ని కోరుతూ ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండలంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. త‌మ కూతురు ఆయేషాకు 13 ఏళ్ల వ‌య‌స‌ని, వెన్న‌ముక‌లో ఏదో గ‌డ్డ ఉంద‌ని తొల‌గించార‌ని, అప్ప‌టి నుంచి కాళ్లు ప‌డిపోయి న‌డ‌వ‌లేక‌పోతోంద‌ని, అంతేకాకుండా డ‌యాల‌సిస్‌తో బాధ‌ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు, బంగారం అంతా అమ్మినా త‌మ కూతురి జ‌బ్బు న‌యం కావ‌డం లేద‌ని, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు వెళ్లితే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తించ‌ద‌ని చెబుతున్నార‌ని జ‌గ‌న్‌తో చెప్పుకుని క‌న్నీరుమున్నీర‌య్యారు. డ‌యాల‌సిస్‌కు నెల‌కు రూ.12వేలు అవుతోంద‌ని, అంత డ‌బ్బు త‌మ ద‌గ్గ‌ర లేద‌ని, త‌మ కూతురిని ఆదుకోవాల‌ని కోరారు. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ స్పందిస్తూ ``ఆయేషాకు ఏం కాదు.. నేనున్నా`` అని వారికి భ‌రోసా ఇచ్చారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌న్నారు. రూ.1000లు ఖ‌ర్చు దాటితే దానిని ఆరోగ్య‌శ్రీ కింద చేర్చుతామ‌ని ఉచితంగా వైద్యం చేయిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com