Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                                వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేయాల‌ని అనుకుంటున్నారు. ఆయ‌న‌కు ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే మ‌హానేత వైయ‌స్ఆర్ పాల‌న‌ను గుర్తుకు తెచ్చేలా ప‌రిపాల‌న చేస్తారు: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తున్నామ‌ని పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పి మోసం చేయ‌డం స‌రికాదు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా                                వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన జామాయిల్ రైతులు                               కందుకూరు శివారు నుంచి 92వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు న్యాయ‌వాదుల సంఘీభావం                               నూక‌వ‌రం నుంచి ప్రారంభమైన 91వ రోజు ప్రజాసంకల్పయాత్ర                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన పొగాకు రైతులు..గిట్టుబాటు ధ‌ర కోసం పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు                 
    Show Latest News
ఎంపీ అవినాష్‌రెడ్డి నిధులతో వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు

Published on : 15-Jul-2017 | 18:05
 

–స్కూల్‌ బ్యాగులు ఇచ్చినందుకు కృతజ్ణతలు
–ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరుః ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి కోటా నిధులతో పాఠశాలలో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక వైవీఎస్‌ బాలికోన్నత పాఠశాల బాలికలకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 650 బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30 న పాఠశాలలో చదువుతున్న బాలికలకు శ్రీ వెంకటేశ్వర ట్యుటోరియల్‌ పూర్వవిద్యార్థులు సురేష్‌రెడ్డి, ఆయన మిత్రబృందం అధ్వర్యంలో యూనిఫాం, ప్లేట్లు అందించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి తో పాటు తాను హాజరయ్యానని తెలిపారు. ఆ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున బాలికలందరికీ బ్యాగులు ఇస్తామని చెప్పడంతో పాటు బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటుచేస్తామని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాల కారణంగా బ్యాగుల పంపిణీలో జాప్యం జరిందని చెప్పారు. ప్రస్తుతం ఎంపీ పంపిన 650 బ్యాగులను బాలికలకు అందిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన నియోజకవర్గంలోని పేద విద్యార్థినులకు బ్యాగులు అందించిన ఎంపీ అవినాష్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ణతలు తెలియచేస్తున్నానని తెలిపారు. అన్ని రాజకీయపార్టీల వారు తమకు తోచిన విధంగా సాయమందిస్తే సమాజానికి సేవచేసినవారవుతారని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాదరెడ్డి, శ్రీవెంకటేశ్వర ట్యుటోరియల్‌ పూర్వవిద్యార్థులు వై.సురేష్‌రెడ్డి(ఆర్టీపీపీ ఏడీఈ), మల్లిఖార్జున, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com