Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆదివారం పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 317వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
గ‌ర్జించిన గుంటూరు

Published on : 09-Aug-2018 | 17:28
 




- వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష విజ‌య‌వంతం
- త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు
- బీజేపీ, టీడీపీ అన్యాయాల‌ను ఎండ‌గ‌ట్టిన పార్టీ నాయ‌కులు 
గుంటూరు: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించారు. ఈ క్రమంలో గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో చేప‌ట్టిన దీక్ష విజ‌య‌వంతం అయ్యింది. గుంటూరు నగరంలోని ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేప‌ట్టిన నిరసన దీక్షలో  వైయ‌స్ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, త‌మ్మినేని సీతారాం, అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ‌, ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, గౌరు చ‌రితారెడ్డి, పుష్ప‌శ్రీ‌వాణి, అనిల్‌కుమార్‌యాద‌వ్‌, చింత‌ల రామ‌చంద్రారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మెల్సీలు పాల్గొని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టారు. 

అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ళ క్రితం వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా  ఇస్తామని ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టేశారు. హోదా కాదు, ప్యాకేజీ అంటూ ప్లేటు ఫిరాయించారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చివరకు పదవులకు రాజీనామా చేసి హోదా ఉద్యమాన్ని ఢిల్లీకి తాకించారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్‌ తీసుకుని ప్రజలను మరోసారి వంచిస్తోంది. ఈ మోసాలను ప్రజలకు వివరించి.. హోదా గళం వినిపించేందుకు వంచనపై గర్జన పేరుతో సింహనాదం చేశారు. హోదాపై ప్రజలను చైతన్యవంతం చేశారు.   

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com