Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             టీడీపీనే పిల్ల కాంగ్రెస్‌ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైంది: ల‌క్ష్మీ పార్వ‌తి                               కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి                               స‌రిప‌ల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి : ఎంపీ వీ విజయసాయి రెడ్డి                               తిరుమల పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు ఆయన నివాసాలకు తరలించే అవ‌కాశం ఉంది: ఎంపీ విజయసాయి రెడ్డి                               హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారు: భూమ‌న                                ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి                                తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 168వ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                 
    Show Latest News
చేనేతలను మోసం చేస్తున్న టీడీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Published on : 12-Sep-2017 | 17:50
 

–చేనేత రిలేదీక్షల్లో వైయస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు గ్రిరాజు నగేష్‌
ధర్మవరం: చేనేతలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తూ.. వారిని ఇబ్బందుల పాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులును చేనేతలు నిలదీయడమే అందుకు నిదర్శనమని వైయస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు గిర్రాజు నగేష్‌ పేర్కొన్నారు. ముడిపట్టు రాయితీ బకాయిల చెల్లింపు కోసం వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు ఆ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి నేతృత్వంలో రెండవ రోజున జరిగాయి. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గిర్రాజు నగేష్‌లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిర్రాజు నగేష్‌ మాట్లాడుతూ... గతంలో కేతిరెడ్డి హయాంలో చేనేతలకు అనేక సంక్షేమ పథకాలు అందేవని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ ఎత్తివేసి చేనేత రంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ముడిపట్టు రాయితీ దాదాపు 19 కోట్లు బకాయిలు పడ్డారని, చంద్రబాబు ధర్మవరం వచ్చి బాహాటంగా ప్రకటించి పోయిన రూ.1,000 సబ్సీడీని కూడా అటకెక్కించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో చేనేతలకు ఒక్కో సంక్షేమపథకాన్ని దూరం చేస్తూ వస్తోందని, త్వరలోనే ఈ తెలుగుదేశం పార్టీని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేతలకు ఇవ్వాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేదిలేదన్నారు. ఈ దీక్షల్లో చేనేత నాయకులు యుగంధర్, నాగభూషణం, కుల్లాయప్ప, అదిశేషయ్య, నాగరాజు, వెంగముని, ఆదిరెడ్డి, లోకేష్, వెంకటేష్, హరి, వీరేంద్ర, నాగార్జున, వెంకటేష్, మురళి, నందీష్, గిరినాథరెడ్డి, కళ్యాణ్‌కుమార్, శ్రీనివాసులు, మధుసూధనరెడ్డి, ఆనంద్‌కుమార్, సూర్యనారాయణ, కాశీంసాబ్, నాగరాజు, వెంకటేషులు, అమానుల్లా, శ్రీనివాసులు, కంచం రామాంజి, సి శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, శివ, వెంకటరమణ, చంద్రశేఖర్, నారాయణస్వామి, కుమ్మర ఈశ్వరయ్య, మాదవ రామాంజినేయులు, వెంకటేష్‌; వన్నూర్‌స్వామి, పాండురంగ, ప్రవీణ్, ఎస్‌ ఉదయ్‌లు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, నాయకులు ఎస్‌వి రమణారెడ్డి, బీరే జయచంద్ర, జాకీర్, శేఖర్‌రెడ్డి, కొళ్లమోరం కేశవరెడ్డి, అంజి, పాలబావి శ్రీనివాసులు, వడ్డేబాలాజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com