Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు న్యాయ‌వాదుల సంఘీభావం                               నూక‌వ‌రం నుంచి ప్రారంభమైన 91వ రోజు ప్రజాసంకల్పయాత్ర                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన పొగాకు రైతులు..గిట్టుబాటు ధ‌ర కోసం పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు                               నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               బీజేపీ, టీడీపీ రెండూ క‌లిసి ఏపీకి అన్యాయం చేశాయి: మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు: పార్ధ‌సార‌ధి                               ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారు: పార్ధ‌సార‌ధి                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌                               బంగార‌క్క‌పాలెం నుంచి 90వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
టీడీపీ వక్రమార్గాలు..నీచ రాజకీయాలు

Published on : 12-Aug-2017 | 16:31
 

నంద్యాల: ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం ప్రభుత్వం వక్రమార్గాలను అన్వేషిస్తోంది. ప్రతి రోజు కొత్త మార్గాలను వెతుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది. తెలుగుదేశానికి ఓటు వేయకపోతే పింఛన్‌లతో పాటు ఏప్రభుత్వ పథకాలను అందివ్వబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల 31 వార్డులో ఓటర్లను ప్రలోభ పెడుతూ తెలుగుదేశం నేతలు మీడియాకు చిక్కారు.  మరోవైపు పారిశుధ్యకార్మికులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఓటర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చేసి తెలుగుదేశానికి ఓటు వేయాలని చెప్పడం వంటి పనులు చేస్తున్నారు. 
 
తాజాగా తెలుగుదేశం నేతలు మరో  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రచారం కోసం డీఆర్‌డీఏ అధికారులను రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి డీఆర్‌డీఏ, సీఆర్‌పీ అధికారలను నంద్యాలకు పిలిపించారు. వచ్చి రాగానే అధికారులు స్వామి భక్తి నిరూపించుకొనే పనిలో పడ్డారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని మహిళా సంఘాలపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ నేతలు డీఆర్‌డీఏ అధికారలు నిర్వాకంపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికార​ దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com