Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             టీడీపీనే పిల్ల కాంగ్రెస్‌ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైంది: ల‌క్ష్మీ పార్వ‌తి                               కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి                               స‌రిప‌ల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి : ఎంపీ వీ విజయసాయి రెడ్డి                               తిరుమల పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు ఆయన నివాసాలకు తరలించే అవ‌కాశం ఉంది: ఎంపీ విజయసాయి రెడ్డి                               హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారు: భూమ‌న                                ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి                                తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 168వ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                 
    Show Latest News
సర్కారు సొమ్ముతో టీడీపీ సోకులు

Published on : 12-Sep-2017 | 16:11
 

– జనం డబ్బుతో పార్టీ కార్యక్రమాలు
– పట్టాల పంపిణీ పేరుతో ఇంటింటికీ 
–ప్రభుత్వం కార్యక్రమంగా  మార్చి నిధుల గోల్‌మాల్‌

స్వామి కార్యం.. స్వకార్యం ఒకేసారి కానిచ్చేయడంలో చంద్రబాబును మించిన మేధావి ఉండడు. జనం సొమ్మును జనానికే తెలియకుండా వాళ్ల జేబుల్లో లాక్కోవడంలో చంద్రబాబు అనుభవజ్ఞుడు. ఎవరికీ అనుమానం రాకుండా తన పని కానిచ్చేయడంలో బాబుకు బాబే సాటి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని చంద్రబాబు ఎప్పడూ చెబుతుంటారు. డీమానిటైజేషన్‌తో దేశమంతా ఉలిక్కిపడితే చంద్రబాబు కుటుంబ సభ్యులు నడిపే హెరిటేజ్‌ సంస్థ మాత్రం ఏ స్థాయిలో వృద్ధి రేటు సాధించిందో చూసి దేశమంతా నోరెళ్లబెట్టేలా చేశాడు. అదీ సంక్షోభంలో పనులు చక్కబెట్టుకోవడం అంటే. అధికారాన్ని వినియోగించుకుని రాజభోగాలు అనుభవించాలన్నా.. జనం సొమ్ముతో జల్సాలు చేయాలన్నా బాబు తర్వాతే ఎవరైనా. జనానికిచ్చిన మాట చంద్రబాబు పట్టించుకోకపోవచ్చుకానీ తన సొంత విషయాలను మాత్రం చంద్రబాబు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. 

జనం సొమ్ముతో ఇంటింటికీ తెలుగుదేశం..
ఇంతకీ అసలు విషయానికొస్తే చంద్రబాబునాయుడు సోమవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ఇక్కడే తన తెలివి తేటలకు పదును పెట్టాడు. పార్టీకి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ సొమ్ముతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం అని ప్రచారం చేసుకుంటూనే.. మంత్రులు పాల్గొనే కార్యక్రమాల్లో డ్వాక్రారుణాల పంపిణీ, ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలను ఇరికించారు. దీంతో సదరు సభ ఖర్చులు మొత్తం సర్కారు ఖాతాలోకి నెట్టొచ్చని బాబు ఆలోచన. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నిర్వహించే కార్యక్రమాల ఖర్చులన్నీ సర్కారు వారి ఖజానాకు కోట్ల భారంగా పరిణమించే ప్రమాదం కనిపిస్తోంది.

ఆగని నిధుల ప్రవాహం.. 
చంద్రబాబు సంక్షోభం వచ్చిన ప్రతిసారీ దాన్ని తన లాభానికి ఎలా మలచుకోవాలో ఆలోచిస్తుంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత మూడేళ్లలోనే చేసిన అరాచకాలను చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది.
– మండుటెండలతో జనం అల్లాడిపోతుంటే చంద్రబాబు దాన్ని తన హెరిటేజ్‌కు ఆదాయంగా మలచుకున్నారు. చలివేంద్రాల్లో మజ్జిగ పథకం తీసుకొచ్చారు. జిల్లాకు రూ.3 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దానికి అవసరమైన పెరుగు, పాలు కూడా హెరిటేజ్‌లోనే కొనుగోలు చేసేలా కలెక్టర్లను ఆదేశించారు. మొత్తం 13 జిల్లాలకు కలిపి రూ. 39 కోట్లు కేటాయించారు.
– దేశమంతా డీమానిటైజేషన్‌ దెబ్బకు కుదేలైతే చంద్రబాబు కుటుంబ సభ్యులు నడిపే హెరిటేజ్‌ షేర్‌ వ్యాల్యూ రూ. 199నుంచి 910 కి పెరిగింది. దాదాపు 9 నెలల్లో షేర్‌ రేటు 435 రెట్లు పెరిగింది. 
– ఇప్పుడు తాజాగా జలసిరికి హారతి పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. చెరువులకు, కాలవలకు హారతులిచ్చే కార్యక్రమం పేరుతో జిల్లాకు రూ. 20 లక్షలు కేటాయించారు. 13 జిల్లాలకు కలిపి రూ. 2.6 కోట్లు కేటాయించారు. తమ్ముళ్లు ఆ నిధులను స్వాహా చేస్తున్నారు. 
డ్వాక్రా మహిళలకు పదివేలు అకౌంట్‌లో వేయడానికి మూడు విడతులు సమయం తీసుకునే బాబు తన పనులకు మాత్రం అప్పనంగా నిధులు కేటాయిస్తూ జీవోల మీద జీఓలు జారీ చేస్తుంటాడు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com