Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                                నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                               ఒక్కసారి వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి..బీసీల సమావేశంలో వైయస్ జగన్                               ప్రతి బీసీ సొదరుడి మొహంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యంః వైయస్ జగన్                               మైదుకూరు నియోజకవర్గం కానగూడురులో బీసీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం                               7వరోజు దిగ్విజయంగా వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర                               బోటు ప్రమాదంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి                 
    Show Latest News
కువైట్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిన రైల్వేకోడూరు వాసులు

Published on : 17-Jul-2017 | 18:35
 

కడప కార్పొరేషన్‌: కువైట్‌ దేశంలో రైల్వేకోడూరు వాసులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ కువైట్‌ కమిటీ సలహాదారు నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు  పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. రైల్వేకోడూరుకు చెందిన పేరం రెడ్డెయ్య నాయుడు, ఎస్‌. ప్రసాద్, ఎస్‌. మస్తాన్, ఎస్‌. మణి, బి. వెంకటయ్య, సిద్దయ్య, మునాఫ్, సాదిక్‌బాషా, కరిముల్లా, జమీర్‌బాషా, నారాయణ మరికొంతమంది వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరికి కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ ...వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో గల్ఫ్‌ సమస్యలపై చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో వీరంతా వైయస్‌ఆర్‌సీపీలో చేరారని తెలిపారు. అనంతరం రెడ్డెయ్య నాయుడు మాట్లాడుతూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే గల్ఫ్‌ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు పి. రెహమాన్‌ఖాన్, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి జి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com