Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               ఇందిర‌మ్మ కాల‌నీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 289వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
రాజకీయ బాహుబలి వైయస్ఆర్ - 5

Published on : 11-Feb-2018 | 13:02
 

              

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న ఆర్యోక్తి కి తాత్పర్యం  తెలిసిన విజ్ఞానఖని  వైయస్ఆర్ .  విద్యారంగానికి వైయస్ఆర్ చేసినంత కృషి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదని చెప్పవచ్చు.  అంతకుముందు పాలించిన చంద్రబాబు కేవలం ఇంజినీరింగ్ కాలేజీల మీద మాత్రమే శ్రద్ధ పెట్టి ఇతర రంగాలను నిర్లక్ష్యం చేశారు.  ఆర్ట్స్ గ్రూపులు దండుగ అని సూత్రీకరించిన మహానుభావుడు ఆయన.  2004  లో కూడా చంద్రబాబు గెలిచి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఆర్ట్స్ గ్రూపులు మాయమై ఒక్క సైన్స్, ఐటి చదువులు మాత్రమే మిగిలేవి.  అదృష్టం బాగుండి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం చెందింది.

 ఇక్కడ ఒక కథ చెప్పుకోవాలి.  ముగ్గురు  మునులు అడవిలో వంద సంవత్సరాలు ఘోరమైన  తపస్సు చేసారు.  వారికి ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు.  మీకు అష్టైశ్వర్యాలు కావాలా?  రాజ్యాధికారం కావాలా?  సకల విద్యలు కావాలా?  అని అడిగాడు.  డబ్బుంటే లోకంలో లేనిది ఏముంది అనుకుని ఒకడు డబ్బు కావాలని కోరాడు.  రాజ్యం  మనదైతే సకల సంపదలు మనవే కదా అని ఒకడు రాజ్యం కావాలి అన్నాడు.  విద్యను మించిన విత్తం లేదని ఒకడు విద్య కావాలి అని కోరాడు. 

 కొన్నాళ్ల తరువాత డబ్బు కోరుకున్నవాడి దగ్గర ఉన్న డబ్బంతా జల్సాలకు ఖర్చయిపోయి దివాళా తీసాడు.  పొరుగున ఉన్న బలమైన రాజు దండెత్తడంతో రాజ్యం కోరుకున్నవాడు ఓడిపోయి రాజ్యం వదిలి పారిపోయాడు.  ఇక విద్యను కోరుకున్నవాడు అన్ని దేశాల్లో పూజలు, సత్కారాలు అందుకుంటూ బోలెడంత ధనం సంపాదించి.. చివరకు ఆ దేశపు రాజు మరణించగా ఈ విద్వాంసుడిని ప్రజలు రాజుగా ఎన్నుకున్నారు! 

 విద్యవలన అన్నీ ఐశ్వర్యాలు, అధికారాలు సమకూరుతాయి.  వైయస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే ముందుగా విద్యాసంస్థలను ఏర్పాటు చెయ్యడానికి నడుము బిగించారు.  అంతకుముందు యాభై ఏళ్లలో రాని అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను కేంద్రంతో పోరాడి మరీ ఆంధ్రప్రదేశ్ కు తీసుకుని వచ్చారు. 

 అంతర్జాతీయంగా రాణించాలంటే తెలుగుతో పాటు ఆంగ్లం మీద కూడా పట్టు అవసరం అని గుర్తించిన వైయస్ఆర్ అధికారులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెట్టాలని సూచించారు.  ప్రభుత్వ పాఠశాల్లలో అది సాధ్యం కాదని అధికారులు విన్నవించారు.  వైయస్ఆర్ కు ఆగ్రహం వచ్చింది.  "నథింగ్ డూయింగ్..మన పిల్లలు మాత్రం కాన్వెంట్లలో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి.  పేదలు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదవాలా?  ఇదేం పధ్ధతి?  వారికి మెరుగైన జీవితాలు అవసరం లేదా?  నా ఆదేశాలు అమలు కావాల్సిందే"  అని గర్జించారు.  'విపక్షాల నుంచి విమర్శలు వస్తాయేమో సార్?" అని గొణిగారు కొందరు అధికారులు.  "విపక్షాల విమర్శలకు భయపడితే పేద విద్యార్థుల భవిష్యత్ పాడైపోతుంది. ఎవరేమనుకున్నా భయపడేది లేదు.  మీరు ముందు పనులు చెయ్యండి.  విపక్షాలను నేను చూసుకుంటాను"  అని నిష్కర్షగా ఆదేశించిన యుగంధరుడు వైయస్ఆర్ !

 కలలో కూడా ఊహించని సర్కారీ ఇంగ్లిష్ బడులు, చదువుల ఘనత ముమ్మాటికీ వైయస్ఆర్ .  వైయస్ఆర్ నిర్ణయం ఫలితంగా అతి తక్కువ ఫీజులతో లక్షలాది విద్యార్థులు అత్యున్నత విద్యలు  ఆర్జించగలిగారు. వీటికి సక్సెస్ స్కూళ్ళు అని పేరు పెట్టారు.  వీటికి కేంద్రం నుంచి వెయ్యి కోట్ల రూపాయల నిధులు అందుతాయని వైయస్ఆర్ ఆశించారు.  అయితే కేంద్రం సాయం అందించలేదు.  అయినా వెరవకుండా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సక్సెస్ స్కూల్స్ నడిపించిన ధృఢసంకల్పుడు వైయస్ఆర్ !!

 గ్రామీణ పేద విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యావకాశాలు కల్పించాలని పరితపించిన మహనీయుడు ఆయన.  ఆ కల సాకారమయ్యేందుకు ఆయన చెయ్యని ప్రయత్నం లేదు.  ప్రయోగం లేదు.  గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ సాటి మేటి అవకాశాలు కల్పించడానికి ఆయన ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం లక్షలాదిమంది విద్యార్థులకు ఊపిరి పోసింది.  "పదో తరగతి పూర్తి చేసిన గ్రామీణ పేద విద్యార్థులకు సంపన్నుల పిల్లల మాదిరిగానే ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి" అన్న వైయస్ఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన బిడ్డడే ఈ విశ్వవిద్యాలయం.

 అంతే కాదు... తన విధానానికి లభిస్తున్న ఆదరణకు చలితుడైన ఆయన ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అనే నినాదాన్ని చేపట్టి,   దాన్ని ఆచరణలో పెట్టిన మేరునగధీరుడువైయస్ఆర్ . ఆయన ఏలిన అయిదు ఏళ్లలో మొత్తం పద్దెనిమిది విశ్వవిద్యాలయాలను స్థాపించారు. రాజమండ్రిలో నన్నయ, నిజామాబాద్ లో తెలంగాణ, కడపలో యోగివేమన, నల్గొండలో మహాత్మా గాంధీ వర్సిటీలను వైయస్ఆర్ సర్కార్ ప్రతిష్టించింది.  ఆ తరువాత శ్రీకాకుళంలో అంబెడ్కర్ యూనివర్సిటీ, నెల్లూరు లో విక్రమసింహపురి, మచిలీపట్నంలో కృష్ణా, కర్నూల్ లో రాయలసీమ, మహబూబ్ నగర్  లో పాలమూర్, కరీంనగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయాలకు ప్రాణప్రతిష్ట చేసిన స్థితికారుడు  వైయస్ఆర్ !! 

 అంతేనా?  అక్కడితో ఆగిపోయారా?  వైయస్ఆర్ విద్యాదాహం అంతటితో తీరిందా?  లేదు లేదు...శ్రీకాకుళం, కడప, ఆదిలాబాద్, ఒంగోలు లో మెడికల్ కాలేజీలను స్థాపించిన ఘనత కూడా ఆయనదే. కేంద్రంతో పోరాడి మెదక్ జిల్ల్లాలో ఒక ఐ ఐ టి ని ఏర్పాటు చేసిన ఘనత కూడా వైయస్ఆర్ దే. 

 ఒకసారి పైన ఏర్పాటు చేసిన పట్టణాల పేర్లను చూడండి.  తెలంగాణ, ఆంధ్ర,  ఉత్తరాంద్ర , రాయలసీమ అనే భేదం ఏమైనా కనిపించిందా ?  అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెయ్యాలన్న లక్ష్యంతో వైయస్ఆర్ విద్యారంగంలో సాధించిన ఘనవిజయాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి.   అప్పటికి దేశంలో గల ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇంత దివ్యాతిదివ్యంగా విద్యారంగంలో విజయాలు సాధించినవారు స్వతంత్ర భారత చరిత్రలో వైయస్ఆర్ తప్ప మరెవరూ లేరు!  లేరంటే లేరు!  అంతే!!!

 అందుకే వైయస్ఆర్ అంటే సవ్యసాచి... కిరీటి... వీరార్జునుడు..ధనంజయుడు..  అవినీతి కి పాల్పడకపోవడం, ఎవరికీ భయపడకపోవడం,  ఆత్మగౌరవం, అభిజాత్యం, పట్టుదల, మొండితనం, తన ప్రజలకోసం మనస్ఫూర్తిగా పనిచెయ్యడం, ఎంతకైనా తెగించడం, చిత్తశుద్ధి అనే లక్షణాలు వైయస్ఆర్ ను ఒక విలక్షణ పురుషుడిగా చరిత్రలో నిలబెట్టాయి.  వాటిలో ఏ ఒక్క లక్షణం నేటి ముఖ్యమంత్రికి లేకపోవడమే ఒక్క విద్యాసంస్థ కూడా గడచిన మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు రాకపోవడానికి కారణం... చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే దుష్ట  మీడియా కారణంగా వైయస్ఆర్ అవినీతిపరుడిగా చిత్రించబడ్డాడు. 

 ఎనీ డౌట్స్??

 (సశేషం)

రచన : ఇలపావులూరి మురళిమోహనరావు 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com