Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన దారుణంః వైయస్ జగన్                               పులివెందుల మాదిరి నంద్యాలను అభివృద్ధి చేస్తాః వైయస్ జగన్                                నంద్యాల ప్రజలారా.. బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండిః వైయస్ జగన్                               ప్రతి కుటుంబానికి నేనున్నాని వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చారుః వైయస్ జగన్                               అవసరానికి వాగ్ధానాలు ఇవ్వడం..ఆతర్వాత ఎగ్గొట్టడం బాబు నైజంః వైయస్ జగన్                               చంద్రబాబు చేసిన అవమానాన్ని ముస్లిం సోదరులు మర్చిపోలేదుః పార్థసారధి                               ఓటమి భయంతో అధికార టీడీపీ ప్రజలను, వైయస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తోందిః పార్థసారధి                               నంద్యాలలో టీడీపీ ఓటమి తథ్యంః పార్థసారధి                               నంద్యాలలో వైయస్సార్సీపీ గెలుపును ఆపలేరుః అంబటి                 
    Show Latest News
వైయస్ జగన్ తో పయనించండి

Published on : 11-Aug-2017 | 17:07
 

నంద్యాలః చంద్రబాబు మోసానికి కాదేది అనర్హం అనే రీతిలో మహిళలు,నిరుద్యోగులు, రైతులు అందరినీ మోసం చేశాడని వైయస్సార్సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను అడుగడుగునా వంచిస్తున్నాడని అన్నారు. రజక, నాయి బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లపై అర్థరాత్రి దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ, వాల్మీకిల ఆత్మీయ సదస్సు పెట్టి టీడీపీ సదస్సుగా మార్చాడని రామయ్య బాబుపై విమర్శలు గుప్పించారు. బీసీ సబ్ ప్లాన్ కు 10వేల కోట్లు ఇస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. బాబు మాటలకు, చేతలకు పొంతన లేదని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి బాబు ఆనందిస్తున్నారని రామయ్య మండిపడ్డారు.  మాల, మాదిగలకు..పులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టాడని బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తో పయనించాలని రామయ్య నంద్యాల ప్రజలకు సూచించారు. మోసపోయే పరిస్థితి ఉండదని,  మాట ఇస్తే తప్పని వ్యక్తి జగన్ అన్న సంగతి గుర్తెరగాలన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు వైయస్ జగన్ చిత్థశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com