Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               నీరు- చెట్టు పేరుతో రూ.కోట్లు కొల్ల‌గొడుతున్న టీడీపీ నేత‌లు: వైయ‌స్ జ‌గ‌న్‌                               గుడిని, గుడిలో లింగాన్ని మింగిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 143వ రోజు అగిరిప‌ల్లి శివారు నుంచి ప్రారంభం                               ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఏప్రిల్ 30న వంచ‌న దినం : వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               142వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నూజివీడు శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 141వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈద‌ర శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                  
    Show Latest News
పండుగ‌లా వ‌చ్చాడు
- వైయ‌స్ జ‌గ‌న్‌కు డ‌ప్పువాయిద్యాల‌తో ఘ‌న స్వాగ‌తం

Published on : 13-Jan-2018 | 13:52
 


- పాద‌యాత్ర చేసే గ్రామాల్లో పండుగ వాతావ‌ర‌ణం
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
చిత్తూరు: వ‌రుస నాలుగేళ్ల పాటు క‌రువుతో అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు సీమ ప్ర‌జ‌ల‌కు ఓ భ‌రోసా దొరికింది. భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం క‌లుగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపంలో వారికి ధైర్యం వ‌చ్చింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల్లాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డంతో స్థానికుల్లో హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు చిత్తూరు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌తి ఊర్లో వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. రైతులకు 'వైయస్‌ఆర్‌ భరోసా', డ్వాక్రా మహిళలకు 'వైయస్సార్‌ ఆసరా', వృద్ధులకు రూ. 2వేల పెన్షన్‌, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువుల కోసం అమ్మ ఒడి పథకం, ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం.. ఇలా తొమ్మిది పథకాలతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ వైయ‌స్ జ‌గ‌న్‌ సంతోషాలు నింపుతున్నారు. 

ఘ‌న స్వాగ‌తం
జ‌న‌నేత వెంట వేలాది మంది అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పాద‌యాత్ర సాగుతున్న ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్నారు.రామ‌చంద్రాపురం మండ‌లం కుప్పం బాదురు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో డ‌ప్పు వాయిద్యాలు, నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దీంతో గ్రామంలో సంక్రాంతి శోభను సంతరించుకుంది. వీధుల్లో చెరుకు గడలు, పూలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, ఇంటి ముందు పూల ముగ్గులు, కూరగాయలు, పండ్లు, గొబ్బెమ్మలు, వేలాడే గుమ్మడిపండ్లు, పొయ్యిమీద పొంగుతున్న వెన్నముద్దలు... ఇలా అందమైన అలంకరణలతో వైయ‌స్ జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు. మహిళలు హారతి పట్టి ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని దీవెనలిచ్చారు. భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, కేరళ వాయిద్యాల సందడితో కుప్పం బాదురు గ్రామంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com