Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
హోదా సహా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే

Published on : 15-Jul-2017 | 12:40
 

  • పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • వైయస్ జగన్ అధ్యక్షతన ఎంపీల భేటీ
  • పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హైదరాబాద్ః విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేకహోదా వస్తేనే అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్సార్సీపీ ఎంపీలు అన్నారు. కాసేపటి క్రితం పార్టీ అధినేత వైయస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లో వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ...రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తనున్నట్టు చెప్పారు. ప్రత్యేకహోదాకు సంబంధించి ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు లోక్ సభ, రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు అన్ని పార్టీల మద్దతు కోరతామన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని, తాము వస్తే పదేళ్లపాటు ప్రత్యేక ఇస్తామని బీజేపీ కూడ ప్రకటించిందని గుర్తు చేశారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేయాలని కోరతామన్నారు. ఇటీవల తమ అధినేత వైయస్  జగన్ ప్రధానిని కలిసినప్పుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని  కోరారన్నారు. హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు అని,  దాన్ని సాధించుకునేందుకు  ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని మేకపాటి మండిపడ్డారు. నంద్యాలలో బాబు ఓటుకు రేటు కడుతున్నాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. 

ఎంపీ వరప్రసాద్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కోరతాం. అదేవిధంగా వస్త్రవ్యాపారులు, హ్యాండ్ లూమ్స్ టెక్స్ టైల్స్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరబోతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతున్నందున పనులు కేంద్రమే చేపట్టాలని కోరబోతున్నాం.  విపత్తు వచ్చినప్పుడు పంటల ఇన్సూరెన్స్,  వాటర్ డిస్ట్రిబ్యూషన్ పలు అంశాలను సభలో లేవనెత్తబోతున్నాం.  స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నాం. దాన్ని అమలు చేయాలని అడగబోతున్నాం. విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేర్చాలని కోరతాం. హోదా విషయంలో వెనుకాడే ప్రసక్తే లేదు. 

ఎంపీ విజయసాయిరెడ్డి
వైయస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇదివరకే ఆర్థికమంత్రిని కలిసి చేనేతకు జీఎస్టీ నుంచి ఎగ్జమ్షన్ ఇవ్వాలని కోరారన్నారు. ఇందుకు ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.  దీన్ని మళ్లీ పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు. హోదా ప్రధాన అంశం. ఏపీ అభివృద్ధి చెందాలంటే హోదాతోనే సాధ్యం.  హోదా సాధన కోసం కృషి చేస్తాం.

ఎంపీ అవినాష్ రెడ్డి
ప్రత్యేక హోదా దగ్గరి నుంచి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వరకు రాష్ట్రానికి సంబంధించి అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి కేవలం నియోజకవర్గాల పెంపు గురించే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురమ్మని బాబు తన ఎంపీలకు హితబోధ చేయడం ఎంతవరకు సబబు. కొత్తగా 50 మంది ఎమ్మెల్యేలకు ఉద్యోగాలివ్వడం కోసం ఇంత తాపత్రయం ఎందుకు మీకు. నియోజకవర్గాల పెంపుమీద పెట్టే శ్రద్ధ ప్రత్యేకహోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద పెడితే లక్షలాది మందికి ఉద్యోగాలొస్తాయని వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com