Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
    Show Latest News
‘వైయస్‌ కుటుంబానికి ముస్లింలు రుణపడి ఉన్నాం’

Published on : 17-Jul-2017 | 18:29
 

కదిరి: ‘మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఆ రిజర్వేషన్‌తోనే ఎంతోమంది ఇప్పుడు పలు పదవులను అలంకరించారు. ఇందులో టీడీపీ వాళ్లు కూడా ఉన్నారు. ఆయన పుణ్యమా అని ఎందరో డాక్టర్లు అయ్యారు..ఇంజనీర్లు అయ్యారు..రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ వైయస్‌ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నారు’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గయాజుద్దీన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన కదిరికి విచ్చేసి ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయర్త డా.పివి సిద్దారెడ్డితో కలిసి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న మున్సిపల్‌ పాఠశాలలో పిల్లలందరికీ తన తండ్రి పేరుమీద స్థాపించిన హెచ్‌ఎన్‌ఎస్‌ సంస్థ ద్వారా ఉచితంగా నాణ్యమైన స్కూల్‌ బ్యాగులు అందజేశారు. అంతకు మునుపు డాక్టర్‌ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముస్లింల జీవితం కడుదయనీయం. అలాంటి వారిని గుర్తించిన ఒకే ఒక్క లీడర్‌ డా.వైఎస్‌. ఆయన పుణ్యమా అని ఇప్పుడు ముస్లింల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చింది. గుండెజబ్బులు లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తే మా వాళ్లకు కార్పొరేట్‌ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునే అంత స్తోమత అందిరికీ ఉండేది కాదు. ఆ మహానుభావుడు ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టి మా గుండెళ్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎలా మరచిపోతామండి?..ముస్లిం మైనార్టీలకు అంతో, ఇంతో న్యాయం జరిగిందంటే అది వైస్‌ కుటుంబం తోనే అని గర్వంగా చెప్పగలం. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని మావాళ్లందరూ కోరుకుంటున్నారు. అది ఆయన కుమారుడు జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నారు’ అని తెలియజేశారు. డా.సిద్దారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లింలంటే గిట్టదని అందుకే తన మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదని గుర్తు చేశారు. కే వలం నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఇప్పుడు ముస్లింలపై కపట ప్రేమను నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను నంద్యాలలో పర్యటిస్తే ప్రతి ముస్లిం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com