Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
సొంత మండల ప్రజలపై వివక్ష చూపుతున్న ఎంపీ రమేష్‌

Published on : 15-Jul-2017 | 18:10
 

ఎర్రగుంట్ల: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు స్వంత మండలంలోని ప్రజలను పట్టించుకోకుండా ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలపై ప్రేమ చూపుతున్నారని, ఎర్రగుంట్లలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు ఇప్పించకుండా ప్రొద్దుటూరు ప్రాంతం ఎర్రగుంట్ల మండలంలో తన వాళ్లకు మాత్రమే ఇళ్లు ఇప్పించాలని చూస్తున్నారని, దీని బట్టి చూస్తే ఎర్రగుంట్ల మండల ప్రజలపై ఆయనకు అపనమ్మకం ఉందని స్పష్టం అవుతుందని వైయస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. ఎర్రగుంట్లలోని పార్టీ కార్యలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎర్రగుంట్ల మండలంలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని తెలిపారు. వారికి ఇళ్లు ఇప్పించడంలో ఎంపీ రమేష్‌నాయుడు శ్రద్ధ చూపలేదన్నారు. ప్రొద్దుటూరు వాసులకు ఎర్ర గుంట్ల మండలంలో స్థలంను కొనుగోలు చేసి ఇళ్లు ఇప్పిస్తామని చెప్పడం చూస్తే స్వంత మండల ప్రజలకు ఆయన ఎలాంటి ప్రేమ ఉందో తెలుసుకోవచ్చన్నారు. ప్రొద్దుటూరు వాసులపై ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారని ప్రశ్నించారు. స్వంత మండలంలోని పేదలకు సాయం చేయలేని వారు పక్క మండలాలకు ఏం చేస్తారని చెప్పారు. ఇక్కడ ఇళ్లు లేక చాలా మంది పేదలు బాడుగ ఇళ్లల్లో జీవనం గడుపుతున్నారని చెప్పారు. అధికారులు వస్తే అభివృద్ధిపై గొప్పలు చెప్పుకోవడం తప్ప మండలంలోని పేదల అవసరాలపై ఏనాడు శ్రద్ధ చూపలేదన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలు ధరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రొద్దుటూరు వాసులకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పడంలో అంతర్యాయం ఎమిటో స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com