Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             విశాఖలో నేడు వైయ‌స్ఆర్‌సీపీ సమావేశం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీటీసీలు                               బ్లాక్‌ డే (బిజిలీ బంద్‌)’ కు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు                               గోపవరపుగూడెం నుంచి ప్రజాసంకల్పయాత్ర 144వ రోజు పాద‌యాత్ర ప్రారంభం                               నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               నీరు- చెట్టు పేరుతో రూ.కోట్లు కొల్ల‌గొడుతున్న టీడీపీ నేత‌లు: వైయ‌స్ జ‌గ‌న్‌                               గుడిని, గుడిలో లింగాన్ని మింగిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 143వ రోజు అగిరిప‌ల్లి శివారు నుంచి ప్రారంభం                               ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఏప్రిల్ 30న వంచ‌న దినం : వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                 
    Show Latest News
ఎన్‌డీఏ ఘోరంగా అన్యాయం చేస్తోంది
ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

Published on : 20-Mar-2018 | 12:54
 

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డీఏ ఘోరమైన అన్యాయం చేస్తుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్‌ హక్కు అని, దాన్ని సాధించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ వాయిదా అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. మరోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. ఇవాళ  ఉదయం కూడా స్పీకర్‌ను కలిశామని చెప్పారు. ఏపీ ఘోరంగా నష్టపోయిందని, ప్రజలు వంచింపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మొదటి నుంచి కూడా కేంద్రం చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారని చెప్పారు. వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారని, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువభేరిల ద్వారా యువతను చైతన్యవంతం చేశారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై అనేక సార్లు మాటలు మార్చారన్నారు. తాజాగా యూటర్న్‌ తీసుకొని పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com