Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
కోవూరు అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు

Published on : 15-Jul-2017 | 19:16
 

– 97 లక్షలు మంజూరు చేసిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి
– వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి 97.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి శనివారం తెలిపారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడుకు ఆర్వో ప్లాంటుకు 5 లక్షలు, పోతిరెడ్డిపాళెం మసీదు దగ్గర రచ్చబండ నిర్మాణానికి లక్ష, చినపడుగుపాడులో ఎన్‌టీయస్‌ గేటు దగ్గర అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి ఏర్పాటుకు 3 లక్షలు, కోవూరు టౌన్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి 5లక్షలు, వేగూరులో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనానికి లక్షా యాభై వేలు మంజూరు చేశారన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు పంచాయతీ శాంతినగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు, నాగాయగుంటలో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు, కొత్తకొండూరుపాళెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు కేటాయించారన్నారు. కొడవలూరు మండలంలోని ఆలూరుపాడు గిరిజనకాలనీలో ఆర్వోప్లాంటు ఏర్పాటుకు 3.5 లక్షలు, బసవాయపాళెం శ్మశానానికి లక్షా యాభై వేలతో గ్రావెల్‌రోడ్డు, దామేగుంట దళితవాడలో సామాజిక భవనానికి 2లక్షలు, తలమంచి కొత్త దళితవాడలో గ్రావెల్‌రోడ్డుకు 2లక్షలు,అలగానిపాడు దళితవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి 4 లక్షలు, గుండాలమ్మపాళెంలోని గాంధీజనసంఘం గిరిజనకాలనీలో సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణానికి 4లక్షలు,పాతవంగళ్లులో సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణానికి 3 లక్షలు, మిక్కిలింపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు,నాయుడుపాళెంలోని అరుంధతీయవాడలో సీసీ రోడ్డుకు 4లక్షలు , దక్షిణ దళితవాడలోని గమళ్లపాళెంలో సైడ్‌ డ్రెయిన్లకు 3లక్షలు, తాటాకులదిన్నె దళితవాడలో సీసీ రోడ్డుకు 2లక్షలు, రామాపురంలో సీసీరోడ్డుకు 4లక్షలు మంజూరు చేశారన్నారు. ఇందుకూరుపేట మండలంలోని రావూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు, జంగంవానిదొరువులో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు,ముదివర్తిపాళెంలో సీసీరోడ్డుకు 4లక్షలు,లేబూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు, నరసాపురం సీసీ రోడ్డు 3లక్షల రూపాయల నిధులు కేటాయించారన్నారు. అదే విధంగా విడవలూరు మండలం ప్రశాంతగిరిలో బస్‌షెల్టర్‌ నిర్మాణానికి 2లక్షలు, వరిణిలో సీసీరోడ్డు నిర్మాణానికి 2లక్షలు,
వావిళ్లలో సీసీ రోడ్డు నిర్మాణానికి 4లక్షలు, విడవలూరు టౌన్‌ న్యూమిక్సిడ్‌ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి 6లక్షల నిధులు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి ప్రసన్నకుమార్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.















సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com