Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
మద్యాంధ్రప్రదేశ్ ఘన చంద్రబాబుదే

Published on : 09-Aug-2018 | 11:31
 

బెల్టు షాపులే లేవు అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఉంటే చూపించండి అంటాడు మంత్రి నారా లోకేష్. ఎక్సైజ్ అధికారులు మాత్రం నెలకు 10,000 నుంచి 20,000 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. నెలనెలా ఈ నెంబర్ పెరుగుతూనే ఉంది. అంటే రాష్ట్రంలో బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉంటున్నాయనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనుడు ఎవరంటే అనుమానం లేదు చంద్రబాబే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగునా ఆయన్ను కలవర పెడుతున్న అంశం ఇదే. ఏ ఊళ్లోకి అడుగుపెట్టినా మహిళలు మొట్టమెదటగా చెప్పుకుంటున్న సమస్య మద్యం మహమ్మారి గురించే. కష్టపడి సంపాదించుకున్న రూపాయిని, మగవాళ్లు తాగుడుకే ఖర్చు పెట్టేస్తున్నారని, కుటుంబాలు వీధిన పడుతున్నాయని తమ గోడు చెప్పుకుంటున్నారు మహిళలు. ఊరూరా ఇబ్బుడి ముబ్బడిగా మద్యం దుకాణాలు పెరిగిపోయాయి. ఒక్కో షాపు పదుల సంఖ్యలో బెల్టుషాపులు నిర్వహిస్తోందని వారు ప్రతిపక్ష నేత దృష్టికి తెస్తున్నారు. ఇళ్ల మధ్యలో, గుడి, బడి ఇలా అన్ని ప్రదేశాల్లోనూ విచ్చలవిడిగా మద్యం షాపులు వెలుస్తున్నాయని వాపోతున్నారు.

బడ్డీ కొట్టు, కిళ్లీ కొట్టు, పచారీ కొట్టు మొదలు కొని ఫోన్ చేస్తే డోర్ డెలివరీ ఇచ్చేలాగానూ మొబైల్ బెల్టు షాపులు పెచ్చు పెరిగిపోయాయి. ఎక్కువ సంఖ్యలో ఉంచితే ఎక్సైజ్ దాడులు ఉంటున్నాయని, మహిళలు పసిగట్టి సమాచారం ఇస్తున్నారని మొబైల్ అమ్మకాలకు తెరతీసారు. అక్రమంగా మద్యం అమ్మే వ్యక్తులు ఒక్క చోట, లేదా షాపుల్లో స్థిరంగా ఉండకుండా ప్రదేశాలు మారుస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల పాత లైసెన్సీలు బెల్టు షాపు నిర్వాహకులుగా మారి, కొనుగోలు దారుల ఇళ్లకే వాళ్లి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

బెల్టు షాపులు అసలు లేవంటూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని ఆ పార్టీ మంత్రే ఒకరు బట్టబయలు చేసారు. మూడేళ్లుగా బెల్టు షాపులను చూసీ చూడనట్టు వదిలేశాం కానీ మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతున్నది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో బెల్టు షాపులు తొలగించాల్సి వస్తోంది అని ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు. వైన్ షాప్ డీలర్ల తో జరిగిన ఓ సమావేశంలో మంత్రిగారి మాటలివి. అంటే ప్రభుత్వానికి తెలిసే బెల్టుషాపుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోందన్నమాట. మూడేళ్లుగా ప్రభుత్వం వేలాది బెల్టు షాపులను చూసీ చూడనట్టు వదలేయడం ఏమిటి అన్న అనుమానం మనకు కలుగుతుంది. దానికి కారణం అవన్నీ అధికార పార్టీవారికి చెందినవి కాబట్టి.  ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 48 వేల బెల్టు షాపులున్నాయట. ఎప్పుడైతే బెల్టు షాపులమీద మహిళలు తిరగబడ్డారో, షాపులపై దాడులు మొదలెట్టారో అప్పుడే ప్రభుత్వంలో చలనం వచ్చింది. బెల్టు రద్దు చేయాలి, ఒక్క బెల్టు షాపు రాష్ట్రంలో ఉండకూడదు అంటూ చంద్రబాబు తన స్టేట్ మెంట్ ను తానే మార్చి చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఆచరణలో అది ఏమాత్రం జరగడం లేదన్నది వాస్తవం. గ్రామాల్లో అత్యధింకంగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. మద్యానికి బానిసై లివర్, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారికి సరైన వైద్యం అందడం లేదు. సంపాదనంతా తాగడుకు ఖర్చు చేయడంతో కుటుంబాల్లో పిల్లల చదువులు, ఆర్థిక పరిస్థితులు తలకిందులౌతున్నాయి.

డీ ఎడిక్షన్ కాదు ఎడిక్షన్

మండలానికో డీ ఎడిక్షన్ సెంటర్ అని చెప్పాడు చంద్రబాబు. ఆ హామీ నెరవేరలేదు కానీ కిళ్లీ కొట్టును కూడా ఎడిక్షన్ సెంటర్ గా మార్చేసిన ఘనత మాత్రం సాధించారు. కల్తీ మద్యం తాగి మరణిస్తున్నా ప్రభుత్వానికి పట్టడమే లేదు. అఫిషయల్ గా మద్యం ఆదాయం ప్రభుత్వానికి, అనఫిషియల్ గా బెల్టు షాపుల ఆదాయం అధికార పార్టీ నేతల జేబులకు చేరుతోంది.

 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com