Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
జంపాల చోటా నయీంగా తయారయ్యాడు

Published on : 15-Jul-2017 | 15:35
 

  • డబ్బుల కోసం వ్యాపారస్థుడిని చంపుతానని బెదిరిస్తారా..
  • ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన కుటుంబరావు
  • మంత్రి దేవినేనికి బ్రోకర్‌గా ఉంటే కేసులు పెట్టరా
  • మీడియా అమరావతి నడిబొడ్డున జరిగే ఈ దుర్మార్గాన్ని అరికట్టాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
  • మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న కుటుంబరావు దంపతులు
విజయవాడ: అధికార అహం, మంత్రుల అండ చూసుకొని టీడీపీ నేతలు చిన్న చిన్న వ్యాపారస్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఆర్యవైశ్య కులానికి చెందిన చిన్న వ్యాపారస్థుడిని ఫోన్‌ చేసి మరీ చంపుతానంటూ మంత్రి దేవినేని అనుచరుడు జంపాల సీతారామయ్య చోటా నయీంలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సీతారామయ్య బాధితుడు కుటుంబరావు దంపతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల వల్ల తమకు ఇబ్బందిగా ఉందని వ్యాపారస్థులంతా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు జరగకుండా ఉండాలంటే మంత్రి దేవినేనికి కోట్లలో కప్పం కట్టాలంట. కుటుంబరావు ద్వారానో.. ఇంకో వ్యాపారి ద్వారానో కొన్ని కోట్లు కప్పం కడితే.. పనులు నిలిపివేస్తారంట. ఇలా మంత్రి చోటా నయీంలను తయారు చేసి వ్యాపారుల మీదకు పంపుతున్నారని ఆరోపించారు. ఇలా మైలవరంలో డాన్‌ శ్రీను మద్యం దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి దేవినేనికి అప్పగిస్తే సీతారామయ్య మాత్రం చిన్న చిన్న వ్యాపారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జంపాల మాజీ రౌడీ షీటర్‌ అని స్పష్టం చేశారు. 

పోలీసుల వైఖరి దుర్మార్గం...
టీడీపీ నేత జంపాల సీతారామయ్యతో తనకు ప్రాణహాని ఉందని, సెల్‌ఫోన్‌ ఆడియో రికార్డింగ్‌లతో సహా రాత్రి 10 గంటలకు కుటుంబరావు పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటి వరకు కేసు పెట్టలేదని జోగి రమేష్‌ మండిపడ్డారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి బెదిరించవచ్చా అని పోలీసులను ప్రశ్నించారు. మంత్రి దేవినేని ఏజెంట్‌గా, బ్రోకర్‌గా ఉంటే కేసులు పెట్టరా అని నిలదీశారు. ఆధారాలతో చూపిస్తే కేసు పెట్టం.. కోర్టుకు నివేదిక ద్వారా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని సీఐ చెప్పడం ఎక్కడా చూడలేదన్నారు. ఒక కుటుంబం మాకు ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేస్తే న్యాయం జరగకపోతే ఇంకా రాష్ట్రం ఎవరికి న్యాయం జరుగుతుందన్నారు. మీడియా మొత్తం ముక్తకంఠంతో అమరావతి నడిబొడ్డున జరిగే ఈ దుర్మార్గాన్ని అరికట్టాలన్నారు. ఛోటా నయీం ఇంకా ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీనికి ఇంతటితో అడ్డుకట్ట వేయాలని మీడియాను కోరారు. మరి ముఖ్యమంత్రి కుటుంబరావు కుటుంబానికి న్యాయం చేస్తారో లేదో.. చూడాలన్నారు. 

ఆర్యవైశ్యుడినని నా కొడకా అని తిడతారా..?
జంపాల సీతారామయ్య ఫోన్‌ చేసి తనను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నాడని, నా తల్లిని ఎందుకు తిట్టడమని కన్నీరు పెట్టుకున్నారు. సీతారామయ్య ఫోన్‌ చేసి తనను రమ్మన్నాడని, నాకు పనుందని కుదరదడం లేదు.. వీలు చూసుకొని వస్తానని చెబితే.. నిన్ను కొట్టుకుంటూ తీసుకొస్తా.. ఎవడు అడ్డువస్తాడో చూస్తానంటూ అసభ్యపదజాలంతో మాట్లాడడని కంటతడి పెట్టుకున్నాడు. నిన్ను చంపేస్తాను.. కొట్టుకుంటూ తీసుకొస్తానంటే నాకు ఎవరూ రక్షణ.. నా పరిస్థితి ఏంటీ అని బాధితుడు మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం దృష్టికి తీసుకెళ్దామనుకుంటే వాళ్ల పార్టీ నేత అని ఆగుతున్నానన్నారు. రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రాణహాని ఉందని చెప్పినా సీఐ పట్టించుకోలేదన్నారు. ఆర్యవైశ్య కులానికి చెందినవాడినని చులకన భావంతో నా కొడకా అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com