Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
జగన్ ఆ పేరే ఒక బ్రాండ్

Published on : 22-Sep-2018 | 18:00
 
సినిమా హీరో కాదు. కానీ స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది...వయసు 40 ఏళ్లే... కానీ సీనియర్ పోలీటిషియన్ కు ఉన్నంత పేరు ఉంది......జాతీయ పార్టీకి సంబంధించిన నేతకాదు, జాతీయ పార్టీలతో పొత్తున్న మనిషీ కాదు..కానీ జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు, చర్చలకు కేంద్ర బిందువయ్యారు...గొప్ప అధికారాలు, పదవులు అనుభవించలేదు అయినా పార్టీ అధినేతగా సమర్థవంతంగా పార్టీని నడిపిస్తున్నారు...వైఎస్ జగన్...రాజీకాయల్లో ఈ పేరే ఓ కొత్త బ్రాండ్ గా అవతరించింది.

పోరాటమే అతని పంథా

చిన్నవయసులోనే పెద్ద సవాళ్లను ఎదుర్కున్న వ్యక్తి జగన్...జగన్ ప్లేస్ లో మరెవరైనా ఉంటే రాజకీయాలకే దణ్ణం పెట్టి వెళ్లిపోయేవారు. కానీ వైఎస్ జగన్ సవాళ్లకు తల వంచలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాటాన్నే ఎంచుకున్నారు. అటు జాతీయంగానూ, ఇటు స్థానికంగానూ అధికార పార్టీలు కుమ్మక్కయి చేసే కుట్రలను ఎదుర్కుంటూనే ఉన్నారు. అతడి వ్యక్తిత్వం మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ప్రజాభిమానం అనే వర్షమే ఆ మకిలిని తుడిచిపెట్టేసింది. దొంగకేసులు బనాయించి నెలల తరబడి నిర్బంధంలో ఉంచారు. న్యాయం అతడివైపు నిలబడి అతడి నిజాయితీని న్యాయస్థానంలోనే నిరూపిస్తోంది. అతడి సంకల్పాన్ని చెదరగొట్టాలనుకున్నారు. అది శిలాశాసనమై చరిత్రలిఖిస్తోంది. జగన్ తనపై విసిరేరాళ్లను మెట్లుగా మలుచుంటున్నారు. తనపై వేసే నిందలకు ప్రజల ప్రేమాభిమానాలనే సమాధానంగా చూపుతున్నారు. ప్రత్యర్థుల అంచనాలను చిత్తుచేసి చూపిస్తున్నారు. సర్వేలు, గణాంకాలు కాదు కళ్లముందు కనిపించే నిజాలే నిఖార్సైనవని నిరూపిస్తున్నారు.

చరిత్ర సృష్టిస్తున్న నేత

ఏడాదిన్నర కాలంగా ఓ నాయకుడు నడవడం, ఆ నడక 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరడం రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమే. కానీ అంతకు మించిన లక్ష్యం ఆ పాదయాత్రది. ప్రజల కష్టాలను దగ్గరగా గమనించి, వారి కన్నీళ్లను తుడవాలన్నదే ప్రజాసంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వం చేసే అక్రమాలు, అన్యాయాలకు ప్రజలు బలైపోతుంటే వారికి అండగా నిలిచే ధైర్యమై ఉన్నామని తెలియజేయడమే ప్రజాసంకల్పం అసలు లక్ష్యం.

జగం మెచ్చిన నాయకత్వం

వైఎస్ లాగా జగన్ పట్టుదల గల మనిషి...మాటమీద నిలబడే మనిషి...గొప్ప నాయకత్వ లక్షణాలు అతడిలో ఉన్నాయి...అన్నారు దాసరి నారాయణరావు. జగన్ లో కష్టపడే తత్వం ఉందని మెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. పొరుగు రాష్ట్రసిఎమ్ కెసిఆర్ సైతం జగన్ ప్రభుత్వాన్ని నిలువరించే తీరును మెచ్చుకున్నారు. సీనియర్ నాయకులు సైతం వైఎస్ జగన్ బలమైన ప్రతిపక్షనేతగా ఎదిగాడని ప్రశంసిస్తున్నారు. ఇటీవలి సర్వేల రిపోర్టులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 43శాతం వైఎస్ జగన్ నే సిఎమ్ అవుతాడని విశ్వసిస్తున్నట్టు ప్రకటించాయి. సంక్షేమ పాలన కోసం నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో గెలుపుతో చరిత్రను మలుపు తిప్పుతాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com