Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
ప్రజా సంకల్పయాత్రకు ఉప్పెనలా ప్రజాదరణ

Published on : 14-May-2018 | 15:08
 

రాజన్న పరిపాలన అందించాలనే వైయస్‌ జగన్‌ పాదయాత్ర
సంఘీభావయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిబింబిస్తున్నాయి
ప్రభుత్వ తీరుకు నిరసనగా 16న వంచనపై గర్జన
ధనార్జనే ధ్యేయంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజాదరణ ఉప్పెనలా వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకొని, వాటిని పరిష్కరిస్తూ, రాజన్న పాలనను అందించాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. జననేత ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న వైయస్‌ జగన్‌ పశ్చిమ గోదావరిలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి  మోసపోయామని ప్రజలంతా వైయస్‌ జగన్ను ఆశ్రయిస్తున్నారని, అందరి సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. సంఘీభావ పాదయాత్రలో నాలుగేళ్ల టీడీపీ వైఫల్యాలు ప్రతిబింబిస్తున్నాయనన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 

మృత్స్యకారుల భృతి ఏమైంది..?

విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ భూకబ్జాలు, ధనార్జనే ధ్యేయంగా ప్రజాకంటక సభ్యుడిగా నిలిచిపోయారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రేషన్‌ సరుకులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు నెలా నెలా రావాల్సిన రూ. 4 వేలSభృతిని ఇవ్వకుండా వారిని ఇబ్బందుకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. .

పోర్టు మత్స్యకారులు అప్పగిస్తామన్న హామీ ఏమైంది..?

ఫిషింగ్‌ హార్బర్‌ను పోర్ట్‌ ఆధిపత్యం నుంచి స్వాధీనం చేసుకుని, మత్స్యకార సంఘాలకు అప్పగిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోగా, విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఆక్రమించుకుంటోందని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన చంద్రబాబు మత్స్యకారుల సమస్యలను పట్టించుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌తో కలిసి వినతి పత్రం అందివ్వడానికి వచ్చిన మత్స్యకార సంఘాల నేతలను తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించడం.. మత్స్యకారుల పట్ల ఆయనకున్న వైఖరిని తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com