Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                 
    Show Latest News
వ్యవసాయాన్ని పండగలా చేస్తాం
రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి

Published on : 20-Feb-2018 | 17:32
 ఒంగోలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండగలా చేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాల తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. ప్రకాశం జిల్లా తిమ్మపాలెంలో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేలనంలో రైతులు చెప్పిన సమస్యలకు ఆయన సమాధానం ఇచ్చారు. రైతులతో ముఖాముఖి ఇలా..

నవ్వలేక ఏడుస్తున్నామన్నా..: ఓబులేస్‌
గతంలో ఎకరాకు 20 బస్తాల కంది దిగుబడి వచ్చేది. ఇవాళ దిగుబడులు రావడం లేదు. మద్దతు ధర అసలే లేదు. ధాన్యాన్ని నిలువ ఉంచుకునే పరిస్థితి లేదు. కోల్టు స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీలు నెరవేర్చలేదు. మీరు బోర్లు ఉచితంగా వేయిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. రైతులను ఆదుకోని, వ్యవసాయం దండగ కాదు..పండుగలా చేయాలని కోరుతున్నాను. ఇక్కడున్న రైతులంతా కూడా నవ్వలేక ఏడ్వలేక ఉన్నారన్నా..
వైయస్‌ జగన్‌: మంచి సలహా ఇచ్చారు. కచ్చితంగా ఆలోచిస్తాం.
––––––––––––––––––––––
వెలుగొండ నుంచి నీరివ్వాలి:  మల్లికార్జున
నాలుగేళ్లుగా వర్షాలు లేక వ్యవసాయం చేయలô కపోతున్నాం. వెలుగొండ నుంచి కాల్వ ద్వారా నీరు తెస్తే 25 గ్రామాలకు సాగునీరు వస్తుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ ఏడాది రెండు ఎకరాలు వరి వేస్తే..పది క్వింటాల్‌ మాత్రమే దిగుబడి వచ్చింది.
వైయస్‌ జగన్‌: ఆ దిశగా ఆలోచన చేస్తాం.
–––––––––––––––
పాడి పరిశ్రమను ఆదుకోవాలి: శ్యామలమ్మ
ప్రైవేట్‌ కేంద్రానికి పాలు పోస్తుంటే డబ్బులు ఇస్తున్నారు. లీటర్‌కు రూ.25 ఇస్తున్నారు. గతంలో ఒంగోలు కో–ఆపరేటివ్‌ డయిరీ వాళ్లు రూ.35 ఇచే ్చవారు.

వైయస్‌ జగన్‌: చిత్తూరు జిల్లాలో ఒక అక్క నావద్దకు లీటర్‌ నీళ్లు, పాలు తీసుకొని వచ్చింది. అన్నా..లీటర్‌ నీళ్లు రూ.25, పాలు మాత్రం రూ.20 కొనుగోలు చేసే నాథుడు లేడన్నా అని చెప్పింది. మనం వచ్చాక పశువుల కొనుగోలు, పశు వైద్య సేవలు విస్తృతం చేస్తాం. పాడి పశువులను పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతాం. 102 పథకం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తాం.
––––––––––––––––––––
బోర్లు వేయించి ఆదుకోండి:  నరసారెడ్డి, చీని రైతు
అన్నా..మాకు పదేకరాల బత్తాయి తోట ఉంది. నాలుగేళ్లుగా కాపుకు వచ్చింది. అయితే వర్షాలు లేకపోవడంతో చెట్లు నరికించాం. అన్నా..మీరు వచ్చాక మాకు బోర్లు వేయించి ఆదుకుంటే బాగుంటుంది. 

వైయస్‌ జగన్‌: ఈ పరిస్థితి చాలా చోట్ల ఉంది. చీని చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చిందంటే రైతులకు కనీసం ఇన్సూరెన్స్‌ ఇవ్వడం లేదు. మనం వచ్చాక మేలు చేసే కార్యక్రమాలు చేద్దాం.
––––––––––––––
హెరిటేజ్‌ మోసాలకు అంతే లేదు:  ప్రభాకర్‌రెడ్డి
అన్నా..హెరిటేజ్‌ చేసే మోసాలు ఒక్కసారి చెప్పాలన్నా..హెరిటేజ్‌ వాళ్లు ప్యాట్‌ తగ్గిందని నెల నెల మోసం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గించి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా కొడుకు రైతు అని ధైర్యంగా చెప్పుకునేలా చేయాలి

వైయస్‌ జగన్‌:వ్యవసాయాన్ని పండుగలా చేద్దాం
–––––––––––––––––
టీడీపీ అంటేనే అరాచకం
అన్నా..మా ప్రాంతంలో ప్లోరైడ్‌ సమస్య అధికంగా ఉంది. పక్కనున్న కందుకూరుకు నీరు వస్తుంది. మాకు మాత్రం మంచినీళ్లు రావడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదు. సంగమేశ్వరం, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేసి మాకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాను. లంచగొండి తనాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి. ఈ రోజు ఏ మండలాఫీస్‌కు వెళ్లినా కూడా రూ.3, 4 వేలు అడుగుతున్నారు. టీడీపీ అంటేనే అరాచకంగా మారింది.

వైయస్‌ జగన్‌: ఫ్లోరైడ్‌ బాధితురాలిని చూస్తేనే బాధనిపిస్తుంది. చేతులు వంకరగా మారడం, మందులు వాడటంతో కి డ్నీలు పాడవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే నీళ్లు మారాలి. సాగర్‌ నీరు తీసుకురావాలి. వెలుగొండ ప్రాజెక్టు, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి కావాలి. నాన్నగారు ఉన్నప్పుడు 18 కిలోమీటర్లకు గాను 13 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. యుద్ధప్రాతిపదికన ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. లంచగొడి తనం దారుణంగా ఉంది. పైన చంద్రబాబు ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, రాజధాని నిర్మాణం, చివరకు గుడి భూములు కూడా వదలడం లేదు. కింద జన్మబూమి కమిటీలు చివరకు మరుగుదొడ్డి కావాలన్నా కూడా లంచాలే. వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేస్తారు కాబట్టిమీకు పింఛన్లు లేవు అంటున్నారు. మనం వచ్చాక ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్లు, రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, ఇల్లు ఇలా ఏది కావాలన్నా 72 గంటల్లోనే అందజేస్తాం. పార్టీలు, కులాలు, మతాలు చూడం. ఈ వ్యవస్థలోకి నిజాయితీ తీసుకొనివస్తాం. పేదవాడి కడుపు నింపుతాం.
––––––––––––––––––––––––––––
మా రేట్లు వాళ్లు ఫిక్స్‌ చేయడం ఏంటన్నా..
మ్రరిపూడి మండలం నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం. నేను పొగాకు పదేకరాలు వేసాం. సరైన దిగుబడి రాలేదు. మా రేటు ఫిక్స్‌ చేసేది ప్రధాని, ముఖ్యమంత్రి. వారికి మా కష్టం ఏం తెలుస్తుంది. రాజమండ్రి ప్రాంతంలోని రామన్నగూడెంలో వైయస్‌ఆర్‌ హయాంలో పొగాకు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకు చంద్రబాబు అక్కడికి వెళ్లలేదట. 

వైయస్‌ జగన్‌: టీడీపీ ఏం చేయడం లేదు. ఓపిక పట్టండి. ఇంక దగ్గరకు వచ్చేశాం
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com