Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
తూ.గో..లో పచ్చ నేతల అవినీతి హోరు

Published on : 10-Oct-2018 | 18:44
 


తూర్పు గోదావరి జిల్లా టిడిపి నాయకుల అవినీతి ఖిల్లా అని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
అయినా తెలుగుతమ్ముళ్ల అవినీతి అక్రమాల గురించి ఇంటిలిజెన్సే చెప్పాలా ఇంగితం ఉన్న ఏ సామాన్యుడైనా చెప్పగలడు. 
మొత్తం 19 నియోజకవర్గాలున్నతూర్పుగోదావరి జిల్లా సంఖ్యాపరంగా చాలా పెద్దది. 
మొత్తం పదమూడు జిల్లాల్లోకెల్ల ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న జిల్లా తూర్పుగోదావరే. 
గత ఎన్నికల్లో టిడిపిని 16 నియోజకవర్గాల ఓటర్లు నమ్మి ఓట్లేసి గెలిపించారు. 
కానీ ఈ 16 మంది ఎమ్మెల్యేలలో అందరికందరూ అవినీతి సామ్రాట్టులేనట. అందులో 8మంది ఐతే ఇష్టారాజ్యంగా జిల్లాను దోచుకుతింటున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, నియంతృత్వ పాలన చేస్తున్నారని పోలీసు నివేదికలు చంద్రబాబుగారి దృష్టికి తీసుకెళ్తున్నాయి. 
ఇసుక మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా. ఇసుక తవ్వకాల నిషేధం సమయంలోనూ ఇక్కడి  నుంచి లోడ్లకు లోడ్ల ఇసుక, మట్టి రవాణా అయ్యింది.
విశాఖ తర్వాత భూ కబ్జాల ఆరోపణలూ ఇక్కడే ఎక్కువే. ప్రభుత్వంలోని ముఖ్య నేతలే సూత్రధారులు, పాత్రధారులూను. 
రియల్ ఎస్టేట్ కోసం మట్టి తవ్వకాలకు నీరుచెట్టు పేరును భీభత్సంగా వాడుకున్నది, అందినకాడికి దోచుకున్నదీ తూగోలో పాగా వేసిన తెలుగు తమ్ముళ్లే. 
ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి ఒకప్పటి వరద బాధితుల సాయాన్ని కూడా బొక్కేసారన్న ఆరోపణలున్నాయి. 
టిడిపి ప్రధాన కార్యదర్శి డొక్కా నాథ్ బాబు ఆర్థిక విషయాల్లో చక్రం తిప్పుతుంటారు.
అమలాపురం ఆనందరావ్ మీద పర్సెంటీజేలు లేకుండా పనులవ్వవని పార్టీలోనే తీవ్ర విమర్శలున్నాయి. 
హోమ్ అండ్ డిప్యూటీ వేస్ట్  చినరాజప్ప నియోజకవర్గానికి ఏం చేయలేదు. పైగా ముద్రగడ వ్యవహారంలో కాపుల వ్యతిరేకత చినరాజప్పపై ఉంది. 
కాకినాడ రూరల్ అర్బన్ ఎమ్మెల్యేలైన  పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరావు మధ్య కీచులాటలు తారాస్థాయిలో ఉన్నాయి.
దళితులను హించిన చరిత్ర తోట త్రిమూర్తులది.
ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై గతంలో ఐటి దాడులు కూడా జరిగాయి. 
మొత్తానికి టిడిపి ఏదో చేస్తుందని నమ్మిన కాపు వర్గీయులు, అటు జిల్లా ప్రజానీకం ప్రజాప్రతినిధుల వైఖరి చూసి ఆగ్రహంతో ఉన్నట్టు అర్థం అవుతోంది. మరోసారి తూగోలకి చంద్రబాబు అండ్ కో బృందాన్ని కాలైనా పెట్టనీకూడదని డిసైడైనట్టనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి జరిగిన వైఎస్ జగన్ వైభవోపేతమైన ఎంట్రీ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇక అధికారపార్టీ నేతల అడ్డగోలు అరాచకాలు, అవినీతి పర్వాలు ప్రజల్లో అసహ్యాన్ని పెంచుతున్నాయని అటు ప్రభుత్వానికీ నివేదికలందాయి. 


 
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com